ఎన్టీఆర్‌ను ఎవరూ పట్టించుకోని సమయంలో తాను దగ్గర అయ్యాయని లక్ష్మీపార్వతి అన్నారు. గురువారం ఆమె తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ తాను వచ్చాకే టీడీపీ మెజార్టీ సీట్లు గెలుచుకుందni ఎన్టీఆర్‌కు వెన్నుపోటు ఎవరు పొడిచారో అందరికీ తెలుసునన్నారు.
కష్టాల్లో ఉన్నాడని పిలిచి పిల్లనిచ్చి పెళ్లి చేస్తే ... న్టీఆర్‌ను పదవీచ్యుతుడ్ని చేసేందుకు... పథకం ప్రకారమే చంద్రబాబు పార్టీలో తన వర్గంవార్ని నింపుకుని వారికే పదవులు ఇచ్చారni ఎన్టీఆర్‌ను ప్రేమించేవారిని, అభిమానించి వారిని ఆయన నుంచి దూరం చేశారన్నారు. . తాను ఎన్నడు ఎన్టీఆర్‌కు కానీ, పార్టీకిగానీ నష్టం కలిగించేలా వ్యవహరించలేదని లక్ష్మీపార్వతి తెలిపారు.