11, నవంబర్ 2010, గురువారం

ఓదార్పుకు అనుకూలంగా మాట్లాడితే చర్యలా,,,,

వైఎస్ రాజశేఖరరెడ్డికి అనుకూలంగా మాట్లాడిన వారిని, ఓదార్పుకు అనుకూలంగా కదులుతున్న శ్రేణులను పార్టీ నుంచి బయటకు పంపిస్తున్నారని పీసీసీ కార్యదరి అంబటి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే
చెవిరెడ్డి భాస్కరెడ్డిని పార్టీ నుంచి ఏకపక్షంగా సస్పెండ్ చేసారని ... పార్టీకి ఎనలేని సేవ చేసిన భాస్కరెడ్డిపై చర్య తీసుకోవడం శోచనీయమని అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో కుట్రపూరిత వాతావరణం నెలకొనివుందని ... పార్టీని అభాసుపాలు చేస్తున్నవారిని, భ్రష్టు పట్టిస్తున్న వారిని ప్రోత్సహిస్తుండడం ఏం న్యాయమని... పార్టీని బలపరిచే దిశగా సాగుతున్న ఓదార్పు యాత్ర ని జగన్ చేస్తే తప్పేమిటని నిలదేస్తూనే... జగాన్ని బలపరిచే నేతలపై ఎదుకు చర్యలుకు దిగుతున్నారో పిసిసి చీఫ్ చెప్పాలన్నారు