రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొణిజేటి రోశయ్య కొనసాగుతారని రాయలసీమ హక్కుల ఐక్యవేదిక అధ్యక్షుడు, కర్నూలు ఎమ్మెల్యే టి.జి.వెంకటేశ్ చెప్పారు. సిఎంగా మరొకరిని నియమించి రోశయ్యను గవర్నర్‌గా పంపిస్తారంటూ రెడిఫ్ మెయిల్ డాట్‌కామ్ ప్రచారం చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఎలాంటి ఆధారాలు లేని వార్తలు ప్రచారం చేసిన రెడిఫ్ మెయిల్ డాట్‌కామ్‌ను నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు..
తప్పుడు ప్రచారానికి పాల్పడ్డ వెబ్‌సైట్‌పై క్రిమినల్ కేసులు పెట్టాలని ...రోశయ్య ముఖ్యమంత్రిగా నియమితులైన తొలిరోజుల్లో ఆ స్థానాన్ని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కోరుకున్నా ఇప్పుడు ఆయన సైతం రోశయ్యను సమర్థిస్తున్నారని, మద్ధతు ప్రకటిస్తున్నారని ఆయన తెలిపారు