1948నుంచి 69వరకు జరిగిన నాటి తెలంగాణ ఉద్యమ స్వరూపాన్ని వివరిస్తూ... మళ్ళీ నేడు ఊపందుకున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని యదాతథంగా కళ్ళకు కట్టేలా తెరకెక్కిస్తున్నట్లు జైబోలో తెలంగాణ దర్శకుడు ఎన్.శంకర్ చెప్పారు. ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసే దిశగా సినిమాను రూపొందిస్తున్నట్లు .. ఖిలావరంగల్ మధ్యకోట, చమన్ వద్దనున్న అమరుల స్థూపం వద్ద ఏకధాటిగా షూటింగ్ నిర్వహిస్తున్నట్లు చెపుతూ హీరో జగపతిబాబు తెలంగాణ ఉద్యమ పోరాట నాయకునిగా నటిస్తూ ప్రత్యేకాకర్షణగా నిలవనున్నారని చెప్పారు.
వరంగల్ కోట మధ్యలో జై బోలో తెలంగాణ/గలగర్జనలా..జడివాన../నెత్తుటి గాయాల వీణ... అంటూ కొనసాగే టైటిల్‌సాంగ్‌తో పాటు హీరో జగపతిబాబు పై ప్రధాన దృశ్యాలను చిత్రీకరించా మని చెప్పారు శంకర్