కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 125 ఏళ్లయింది. ఈ సందర్భంగా 14 నుంచి 19వ తేది వరకు హైదరాబాద్, వరంగల్, గుంటూరు, విజయవాడ, తిరుపతి, మెదక్ లేదా నల్గొండలలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. తిరుపతిలో 17వ తేది జరిగే ఉత్సవాలకు ముఖ్యమంత్రి రోశయ్య హాజరు కానున్నారు..
ప్రతి నియోజకవర్గంలో ఈనెల 15న మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కాంగ్రెస్ ఉత్సవాలకు ఖాదీ దుస్తులు, టోపి ధరించాలని లేదా తెల్లదుస్తులైనా వేసుకుని రావాలన్నా సూచనలు చేసారు. గాంధీ, నెహ్రూ, ఇందిర, రాజీవ్‌గాంధీ ఎవరో కూడా తెలియని వారు నేటికీ మారుమూల పల్లె ప్రజలున్నాయని వీరందరికీ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం గురించి వివరించాలన్న భావన వ్యక్తమవుతోంది
ఈ సందర్భంగా ఫొటో ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందించాలన్న ఏర్పాట్లు చేస్తున్నారు.