కడప నగరం కొండాయపల్లె లో ఉన్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్‌టి రామారావు విగ్రహాన్ని తెలియని దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహం చేయి సగం వరకు పడి పోయింది. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్య లో సంఘటనా స్థలానికి చేరుకుని ఆగ్రహంతో ఊగిపోయారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ విగ్ర హాల ఏర్పాటుకు అనుమతి లేకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని అయితే ఎన్‌టిఆర్ లాంటి మహోన్న తుడి విగ్రహానికి హాని జరగడాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకోవాల న్నారు. నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని శాసన మండలి సభ్యుడు ఎం.వెంకటశివారెడ్డి డిమాండ్ చేశారు