11, నవంబర్ 2010, గురువారం

బెల్టు వివరాలివ్వండి : హైకోర్టు

ప్రతి పల్లె ఈ మత్తులో జోగుతోంది. నివాసిత ప్రాంతాలు, ప్రార్థనా మందిరాలు, పాఠశాలలు ఉన్నచోట మద్యం అమ్మకాలు జరగడానికి వీలులేదని, బెల్టు (గొలుసు) దుఖాణాలు ఎక్కడైనా ఉంటే వాటి వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తాజాగా హైకోర్టు కోరింది.

గతం నుంచీ కోర్టులు మద్యం విచ్చలవిడి అక్రమాలపై నియంత్రణ ఉండాలన్న వాదనను వినిపిస్తూనే ఉన్నా నేటి పాలకులకు చెవిటి వాని ముందు శంఖం' ఊదిన చందాన కాగితాలకు పరిమితమవ్వడం వల్ల ఈ సారైనా కోర్టు ఉత్తర్వులకు ప్రభుత్వం, స్వచ్ఛంధసంస్థలు, ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు స్పందించే తీరునుబట్టే కోర్టు ఆదేశాలు అమలవుతాయని సర్వత్రా వినిపిస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో 2 నుంచి 3 ఆపైనే బెల్టుషాపులు ఉన్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కార్మికులు, ఇతర కష్టజీవులు పనిచేశాక 68శాతం మద్యం అమ్మకాలలో వీటి పాత్ర కీలకంగానే ఉంది అన్నది వాస్తవం ..లక్షలాదిమంది ప్రజలను తాగుడుకు బానిసలు చేస్తూ లైసెన్సులను విచ్చలవిడిగా ప్రభుత్వం మంజూరు చేయడం, బెల్టుషాపులు కూడా ఇష్టా రాజ్యంగా ఏర్పాటు చేయడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. గ్రామంలో రోడ్డు, లేదా గుడికి ప్రతి నెలా ఫలానా ఇంత ఇస్తామని ఒప్పించి బెల్టుషాపులు పెట్టి దందా సాగిస్తున్నారు.

మమ్ముల్ల మట్ట్లో జోగుతున్న ఎక్సైజ్‌ అధికారులు బెల్టుషాపులపై నోరుమెదపని తీరు, లక్ష్యాల కోసం ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానం తోడై ప్రజలను బానిసలుగా మారుస్తోంది.