తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు టీడీపీ నేత చంద్రబాబే అడ్డుపడుతున్నారని టీఆర్‌ఎస్ అధినేత కే. చంద్రశేఖరరావు ఆరోపించారు. కాంగ్రెస్ సీనియర్ నేత కే. కేశవరావుతో కలిసి గురువారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లా డుతూ నేటికీ శ్రీకృష్ణ కమిటీకి చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా నివేదిక ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు.
ఇప్పటికే తేలంగాణలో టీడీపీ పరిస్తితి దారుణమని.. చంద్రబాబును చూస్తే జాలి కలుగుతోందని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత కేంద్రం నిర్ణయం కోసం జనవరి నెలాఖరు వరకు ఆగుతామని కేసీఆర్ చెప్పారు. కమిటీ నివేదిక ఎలా ఉన్నా తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని డిమాండుతో ఉద్యమం చేపడతామని ఐతే తెలంగాణా ఏర్పాటు కు నిర్దిష్ట గడువు లేనే లేదని తేల్చే చెప్పారు కెసిఆర్ .