ఈ నెల 21న విజయవాడలో జరిగే ఆర్యవైశ్య సమ్మేళనంకు రాష్ర్టంలోని ఆర్యవైశ్యులందరూ విచ్చేసి విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సభ్యుడు పబ్బిశెట్టి సురేష్ కుమార్ పేర్కొన్నారు.
భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టిన గాంధీజీ ఆర్యవైశ్యుడని, ఆంధ్ర రాష్ట్ర అవతరణకు కారకుడైన పొట్టి శ్రీరాములు ఆర్యవైశ్యుడని, ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న వ్యక్తి ఆర్యవైశ్యుడేనని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కొణజేటి రోశయ్యను గద్దె దింపడానికి ప్రతి పక్షంపాటు అధికార పక్షం కూడా పావులు కదుపుతున్నప్పటికీ ఆయనను గద్దె దింపలేకపోయారన్నారు. రోశయ్యకు అన్ని శాఖల్లో అనుభవం వుండడం వల్ల అధిష్టానం ఆయనకే ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
భారత దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకూ ఏకైక ఆర్యవైశ్య ముఖ్యమంత్రి కె. రోశయ్య అన్నారు. విజయవాడలో జరిగే ఆర్యవైశ్య సమ్మేళనంలో ఆయనను ఘనంగా సన్మానించనున్నట్లు తెలిపారు