కాంగ్రెస్‌లోని వర్గపోరుతో ప్రజారాజ్యం పార్టీ నాయకులు అప్పుడే ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కాంగ్రెస్‌లో ప్రస్తుతం పదవుల్లో ఉన్న వర్గంతో చేతులు కలిపితే ప్రభుత్వం ఉన్నంత కాలం తమ పనులు జరుగుతాయని, ఆ తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవచ్చనే తుది నిర్ణయానికి వచ్చినట్లు పీఆర్పీ వర్గాలు తెలిపాయి. అయితే ఇదే తుది నిర్ణయంగా భావిస్తే తాము ఇంకోదారి చూసుకుంటామని..యువరాజ్యం నాయకులు కాంగ్రెస్ పార్టీ కండువాలు వేసుకున్నచివరకు అందరం ప్రస్తుతం అధికార పక్షంలోని కీలక నాయకుల నాయకత్వంలోనే పని చేసి భవిష్యత్‌లో జరిగే మార్పులకు అనువుగా నిర్ణయం తీసుకుందామనే నిర్ణయించుకున్నట్లు తెలిసింది.