10, ఫిబ్రవరి 2011, గురువారం

సింగరేణికి ‘సహాయ నిరాకరణ’ దడ

ఆర్థిక సంవత్సరం దగ్గర పడుతుండటంతో సింగరేణిలో కలవరం మొదలైంది. తెలంగాణ ఉద్యమ నేపధ్యంలో కంపెనీ వార్షి క లక్ష్యాలపై నీలినీడలు కమ్ముతున్నాయి. ఈ నెల 17 నుంచి సహాయ నిరాకరణ ఉద్యమానికి రాష్ట్ర జేఏసీ పిలుపు నివ్వడంతో యాజ మాన్యంలో ఆందోళన ప్రారంభమైంది. సమ్మె జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఉద్యమ ఉద్ధృతి పెరిగితే సింగరేణిలో నిరవధి క సమ్మె జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు

ఈ ఏడు రికార్డు స్థాయి లో 51.3 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సింగరేణి లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ 100శాతం వార్షిక ఉత్పత్తి సాధించాలంటే మిగిలిన 50 రోజల్లో ఇంకా 8.40 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించాలి. ప్రస్తుత పరిస్థితులు ఉత్పత్తి లక్ష్యసాధనకు ప్రతి బంధకంగా కనిపిస్తున్నాయి.