సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి త్వరలో ముంబైకి నాన్‌స్టాప్ సూపర్ ఎక్స్‌ప్రెస్ రైలు దొరెంతోను ప్రారంభించనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆర్. విజయ్‌మోహన్ తెలిపారు. అత్యాధునిక వసతులతో కూడిన జపాన్ దేశ టెక్నాలజీతో తయారైన దొరెంతో వంద శాతం ఏసీ కోచ్‌లుంటాయని, రైలు ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు.