జనంతో కల్సి నడిచేవాడే జన హితుడు, ప్రజా నాయకుడు అవుతాడని.. అలాంటి లక్షణాలనింటిని వారసత్వంగా పుణికి పుచ్చుకున్న వైఎస్ జగన్ తండ్రి చూపిన మార్గంలోనే పోలవరం లక్ష్య సాధన కోసం హరిత యాత్ర పేరుతో లక్షలాది జనంతో పాదయాత్ర చేస్తుంటే అధికార పక్షానికే కాదు విపక్షాలకీ ముచ్చెమటలు పడుతున్నాయని అన్నారు సినీ నటి రోజా.
గురువారం ఆమె పోలవరంలో జగన్ హరితయాత్ర ముగింపుసభలో మాట్లా డుతూజగన్ చేపట్టిన యాత్రకి రాయలసీమ, తెలంగాణా, కోస్తా, ఆంధ్రా ప్రాంతాల నుండి రైతులే స్వచ్చంధంగా తరలివచ్చి మద్దతు తెలుపుతుంటే అందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఇప్పటికైనా రాష్ట ప్రభుత్వమే సొంత నిధులతో పోల వరం నిర్మాణం పూర్తికి నడుం బిగించాలని సూచించారు.
జలయజ్ఞం ద్వారా ఆంధ్ర ప్రదేశ్‌లోని ప్రతి నీటిచుక్కని వినియోగించి సస్య శ్యామలంచేసి హరితాంధ్రప్రదేశ్ చేయాలని తండ్రి కన్నకలల్ని నెరవేరేందుకు కృషి చేస్తు న్న జగన్‌ని ఎలాగైనా అణగద్రొక్కాలని అన్ని పార్టీలు కల్సి ప్రయత్నిస్తున్నాయ ని.. వీరందరికీ తగిన బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని ప్రజలకు పిలు పు ఇచ్చారు రోజా. పోలవరం ప్రోజక్టుకు జాతీయహోదా కోరుతూ జగన్‌కి మద్దతు గా నిలచిన ప్రజల్ని చూసైనా కేంద్రప్రభుత్వం తక్షణం జాతీయహోదా ప్రకటించా లని డిమాండ్ చేసారు రోజా.