క్రైస్తవ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం గుణదలలో మేరీమాత ఉత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బస్సులు, రైళ్ళలో వేలాది మంది యాత్రికులు పుణ్యక్షేత్రానికి చేరుకున్నారు. పరిశుద్ధ మరియమాతను దర్శించుకునేందుకు తమ మ్రొక్కుబడులు చెల్లించుకున్నారు. రాత్రి 8 గంటల సమయానికి కొండ ప్రాంతమంతా భక్తులతో కిక్కిరిసి పోయింది.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు..
బిషప్ గ్రాసి పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటైన ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు యాత్రికులను అలరించాయి. కోలాటం, మిమిక్రీ, దావీదు విజయం నాటకం, సంసోను- డిలైలా బురక్రథలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.