10, ఫిబ్రవరి 2011, గురువారం

రీఛార్జి కన్నా... సిమ్‌కార్డు మిన్న..

సిమ్‌కార్డులు అంగ ట్లో కూరగాయల మాదిరిగా లభిస్తున్నాయి. సెల్‌ఫోన్ కంపెనీల్లో పెరిగిన పోటీల కారణంగా ఆయా సంస్థలు సిమ్‌కార్డుల ఆఫర్లను పెంచుతున్నాయి. దీంతో ఒకరి వద్ద ఒకే సెల్ నంబర్ ఉండే రోజులు పోయాయి. ఒకటి, రెండు సిమ్‌కార్డులు కాక ఎన్ని సెల్‌ఫోన్ నెట్‌వర్కులున్నాయో అన్ని నంబర్లు ఉంటున్నాయంటే అతిశయోక్తికాదు. అతితక్కువ ధరకే సిమ్ కార్డు లభించడమే కాక టాక్‌టైం అధికంగా రావడంతో యువతీయువకులు రిఛార్జి చేయించుకోవడమే మానేస్తున్నారు.

దీంతో రీఛార్జి షాపులు వెలవెలబోతుండగా సిమ్‌కార్డు విక్రయాల కోసం వెలిసిన డేరాలు కళకళలాడుతున్నాయి. మార్కెట్‌లో దొరుకుతున్న సిమ్‌లు రూ.5 కే విక్రయిస్తు రూ.30 నుంచి 50 టాక్‌టైంతోపాటు ఎస్‌ఎంఎస్ ఆఫర్‌సైతం వర్తింపచేస్తుండడంతో వినియోగదారులు సిమ్‌కార్డులవైపే మొగ్గుచూపుతన్నారు.దీంతో యువకులు జేబులోనే ధ్రువీకరణ పత్రాలు, ఫొటోలతో తిరుగుతున్నారు. ఏ సంస్థ ఆఫర్ నచ్చితే ఆ సంస్థ సిమ్‌కార్డు కొంటున్నారు.