గ్యాస్ నిక్షేపాల కేటాయింపులో అప్పటి టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, ఆ అక్రమాలలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఈనాడు అధినేత రామోజీరావు పాత్ర ఉందని పుష్కరకాలం తరువాత అవాస్తవ ప్రచారం చేసి రాజకీయ లబ్ధిపొందేందుకు జగన్ వర్గం ప్రయత్నిస్తోందని పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు విమర్శించారు.
టీడీపీ హయాంలో కేజీ బేసిన్‌లోని గ్యాస్ నిక్షేపాలకు సంబంధించి గ్లోబల్ టెండర్లు నిబంధనల మేరకు జరిగిందన్నారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం రిలయన్స్‌కు అక్రమంగా గ్యాస్ నిక్షేపాలు దోచిపెట్టి ఉంటే, ఆ తరువాత ముఖ్యమంత్రిగా వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి ఎందుకు విచారణకు ఆదేశించలేదని వారు ప్రశ్నించారు. గ్యాస్ నిక్షేపాల కేటాయింపుల వెనుక అవినీతిని వెలికి తీసేందుకు ఏర్పాటు చేసిన ఏపీ గ్యాస్ అథారిటీని దివంగత వైఎస్ నిర్వీర్యం చేశారన్నారు.
జగన్ రాజకీయలబ్ధి కోసం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.