ఎన్నో ఏళ్లుగా తనకు పిసిసి ఛీఫ్ డి. శ్రీనివాస్‌కి అనుబంధం ఉందని... ప్రజా రాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్న నాడు తొలిసారి అభినందిం చింది ఆయననే అని వ్యాఖ్యానించారు తాజా కాంగ్రెస్ నేత చిరంజీవి.
బుధవారం ఆయన పిసిసి ఛీఫ్ డిఎస్‌ని కలిసిన అనంతరం మీడియాలో ముచ్చటిస్తూ... విలీన ప్రక్రియకు సంబంధించి చట్టబద్దంగా అన్ని కార్యక్రమాలు పూర్తయాక విలీన సభను భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌పార్టీ బలోపేతానికి అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తానని, సోనియా నాయకత్వాన్నిబలపరుస్తానని, అధినాయకత్వం ఏ బాధ్యతలు ఇచ్చినా నెరవేరేందుకు సిద్దంగా ఉన్నానని అన్నారు.
వైఎస్ హయాంలో భారీ అవినీతి జరిగిందని ఢిలీలో చేసిన ఆరోపణకు కట్టుబడి ఉంటారా? అని చిరంజీవిని ప్రశ్నించిన విలేఖరులకు ఎవరని హయాంలో అవినీతి జరిగినా దానిపై విచారణ కోరటం తప్పెలా అవుతుందని ఆయన సమాధానమిస్తుండగా...డిఎస్ కలుగచేసుకుని వైఎస్ హయాంలో అని ప్రత్యేకంగా చిరంజీవి చెప్పలేదంటూ సర్ధిపుచ్చేయత్నం చేయటం గమనార్హం.