భవ్య క్రియేషన్స్ పతాకాన బి.వి.ఎస్.రవి దర్శకత్వంలో 'వాంటెడ్' చిత్రం రూపొందింది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అన్నే రవి, నిర్మాత వి. ఆనందకుమార్.
గోపిచంద్, దీక్షాసేథ్, జయసుధ, చంద్రమోహన్, ప్రకాష్‌రాజ్, నాజర్, బ్రహ్మానందం, సుబ్బరాజు ముఖ్యపాత్రలు పోషించిన 'వాంటెడ్' చిత్రాన్ని ఇసి చూసి 4 కట్స్‌తో 24-01-2011న 'యుఎ' సర్టిఫికెట్ జారీచేసింది.
1. మొదటి రెండు రీళ్ళలో చిత్రీకరించిన 'నిత్యానందం' పదాన్ని తొలగించి శబ్దం వినబడకూడదన్నారు.
2. మూడు నాలుగు రీళ్లలో పిక్చరైజ్ చేసిన 'నా కాయని గిచ్చావ్' అనే డైలాగ్‌లలోని ''కాయ''ని తొలగించి శబ్దం వినరాకూడదన్నారు.
3. అయిదు ఆరు రీళ్ళలో చిత్రీకరించిన సన్నివేశంలో 'స్త్రీలను గర్భిణీ స్త్రీలను చేస్తూ వుంటారు' అనే డైలాగ్‌ని తొలగించి శబ్దం వినబడనీయకూడదన్నారు.
4. తొమ్మిది పది రీళ్ళలో గల 'ముండ' పదాన్ని తొలగించి శబ్దం వినబడనీయ వద్దన్నారు.
16 రీళ్ళ నిడివిగల 'వాంటెడ్' 26-1-2011న విడుదలయింది.