సీటు ఇస్తానని కోట్ల రూపాయాలు తీసుకుని చిరంజీవి తనను మోసం చేశారని ప్రజారాజ్యం మహిళా నాయకురాలు జయలక్ష్మీ ఆరోపించారు. బుధవారం ఆమె సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. గత ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ సీటు తనకు ఇచ్చేందుకు చిరంజీవి రూ.5కోట్లు డిమాండ్ చేశారని కాగా, రూ.2 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నామని ఆమె తెలిపారు. చిరంజీవి బావమరిది అల్లు అరవింద్‌కు రూ.2కోట్లు ఇచ్చానని జయలక్ష్మీ చెప్పారు.
డబ్బులు ముట్టిన తరువాత తనతో ఆదరంగా వ్యవహరించేవారని, అయితే చివరికి చేవెళ్ల స్థానాన్ని కాసాని జ్ఞానేశ్వర్‌కు కేటాయించారని ఆమె ఆరోపించారు. ఈ విషయంలో తాను ఘోరంగా మోసపోయానని, అలాగే ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని ఆమె చెప్పారు. డబ్బుల గురించి అడిగితే సమాధానం దాటవేస్తూ వచ్చారని జయలక్ష్మీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
చిరంజీవి పచ్చి అవినీతిపరుడని ఆమె విమర్శించారు. ఈనెల 15వతేదీ లోగా తన డబ్బు తిరిగి విఇవ్వకుంటే ఆమరణ దీక్ష చేపడతానని ఆమె ప్రకటించారు.