23, జూన్ 2011, గురువారం
27న మార్కెట్లోకి ఎతియోస్ లివా
భారత వాహన రంగంలోకి మరో చిన్న కారు రానుంది. టయోటా కిర్లోస్కర్ మోటార్స్ తామందిస్తున్న ఎతియోస్ బ్రాండ్ కింద లివా పేరిట చిన్న కారును ఈ నెల 27న విడుదల చేయనుంది. మారుతి సుజుకి, నిస్సాన్, ఫోర్డ్, చవర్లెట్, వోక్స్‌వాగన్ వంటి కంపెనీలు ఇప్పటికే తమ తమ కాంపాక్ట్ కార్లను విడుదల చేసిన నేపథ్యంలో టయోటా సైతం అదే దారిలో పయనించనుంది. కొత్తగా రానున్న టయోటా లివా ధర 4 లక్షల రూపాయల నుంచ ప్రారంభం కావచ్చని, ఎయిర్‌బ్యాగ్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ గల హై ఎండ్ కారు ధర 5.5 నుంచి 6 లక్షల రూపాయల మధ్య ఉంటుందని నిపుణుల అంచనా. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని హాచ్‌బ్యాక్ కార్లతో పోలిస్తే ధర తక్కువగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మారుతి స్విఫ్ట్, హ్యుందాయ్ ఐ20, వోక్స్ వాగన్ పోలో, నిస్సాన్ మైక్రా, స్కూడా ఫాబియా, ఫియట్ పుంటో తదితర కార్ల ధరలు 4.3 నుంచి 8 లక్షల రూపాయల మధ్య ఉన్న సంగతి తెలిసిందే.