త్వరలోనే వైఎస్ సువర్ణయుగం వస్తుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లాలో కొనసాగుతున్న ఓదార్పుయాత్రలో భాగంగా గుట్టూరులో జగన్ ప్రసంగించారు. గుట్టూరులో ఓదార్పుయాత్రకు భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. ఓదార్పుయాత్రలో జగన్ మాట్లాడుతూ ... త్వరలోనే మంచి రోజులు వస్తాయన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టిస్తున్నారని జగన్ అన్నారు. ఈ ప్రభుత్వ ఎప్పడూ కూలిపోతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నరని జగన్ అన్నారు.