రాష్ట్ర మంత్రులు తమ ఆస్తుల వివరాలను ఆగస్టు నెలాఖరులోగా వెల్లడించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం ఆదేశించారు. ఈ విషయమై ప్రాథమిక, వయోజన విద్య శాఖ మంత్రి సాకే శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ మంత్రులు ఆస్తుల జాబితాను వెల్లడించాలని సీఎం సర్క్యూలర్ జారీ చేసిన విషయం వాస్తవమేనని అన్నారు.
తన ఆస్తి వివరాలను జూలై 15వ తేదీ లోపల వెల్లడిస్తానని చెప్పారు. ఇందులో పెద్ద విశేషం ఏమీలేదని, మంత్రులు ఎవరెవరు ఎంత సంపాదించారు, లేక ఎంత పోగొట్టుకున్నారు అన్న విషయాన్ని వెల్లడిస్తే సరిపోతుందని మంత్రి పేర్కొన్నారు.