హైదరాబాద్, జూన్ 23 : సోంపేటలో నిర్మించతలపెట్టిన విద్యుత్ కేంద్రానికి భూ కేటాయింపులపై హై కోర్టు స్టే విధించింది. సోంపేట విద్యుత్ కేంద్ర నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ జి.ఓ.పై అన్ని తదుపరి చర్యలనూ నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది.
సోంపేటలో విద్యుత్ కేంద్రం నిర్మాణానికి 2008లో రాష్ట్ర ప్రభుత్వం 1000 ఎకరాలు కేటాయించింది. ఇందుకు సంబంధించిన జి.ఓ. కూడా అప్పుడే జారీ అయ్యింది. ఇప్పుడు ఆ జి.ఓ.పై హై కోర్టు స్టే విధించింది.
సోంపేటలో విద్యుత్ కేంద్రం వద్దంటూ అక్కడి ప్రజలు కొన్నాళ్లుగా తీవ్ర ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.