23, జూన్ 2011, గురువారం

త్వరలో యాహు పాఠాలు...

నేటి ఆధునిక యుగంలో ఇన్ఫర్మేషన్‌టెక్నాలజి దూసుకుపోతున్న తరుణంలో ప్రతి ఒక్కరికి కంప్యూటర్‌ నిత్యావసరంగా మారుతోంది. ఏ చిన్న సమాచారం కోసమైనా నేటియువతరం ఆశ్రయించేది ఇంటర్నెట్‌నే. ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చాక దాదాపు ప్రపంచం అంతా మొత్తం ఓ కుగ్రామంగానే కాదు ఏకంగా మనిషి అరచేతిలోకి వచ్చేసిందనటంలో సందేహమేలేదు. మనిషి నిత్యజీవితంలొ ఇంటర్నెట్‌ ఓ భాగమైపోయింది. విద్య, ఉద్యోగం, వివాహం ఇలా అన్నింటికీ ఇం టర్నెట్‌నే ఆధారంగా చేసుకుని నేటి యువత తమ జీవన విధానాన్ని మార్చేసుకొంటోంది. సెల్‌ ఫోన్‌ ఎంత అవసరంగా మారిందో నేడు ఇ-మైల్‌ చిరునామా కూడా అంతే అవసరంగా మారి ంది. ప్రస్తుతం ఇ-మైల్‌ ఖాతాలను పలు సాంకేతిక సంస్ధలు అందిస్తుంటే.... యాహూ మరో అడుగు ముందుకేసి స్ధానిక భాషల్లో పాఠశాల విధ్యని అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. 'లెర్న్‌ యాహు' పేరుతో ఒక ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసి ఇంటర్నెట్‌ వినియోగదారులకు అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు యాహూ ఇండియా సీనియర్‌ డైరక్టర్‌ నితిన్‌ మాథ్యూర్‌ వెల్లడించారు. ఇటీవల ప్రయోగాత్మకంగా పరిశీలన చేయగా మొదటి ప్రయత్నంగానే వినియోగదారుల నుంచి 'యాహూ'పై అనూహ్య స్పందన లభించడంతో మరిన్ని సాంకేతిక మార్పులతో పూర్తిస్ధాయిలో వినియోగానికి తేవాలనే ప్రయ్నంలో ఉన్నట్లు తెలిపారు. తమ సంస్ధ యాహూ! ఇండియా చేపట్టిన సర్వేలో ప్రస్తుతం ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య భారత్‌లో 81.7 శాతానికి చేరినట్లు వెల్లడైందని. అంతే గాకుండా చాలా మంది ఇంటర్నెట్‌ వినియోగదారులు తమ మాతృభాషలో ఇంటర్నెట్‌ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నట్లు తేలిందని అందుకు అనుగుణంగానే మార్పులు చేపట్టామన్నారు. - జి.సీతారామ్‌