రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ నాలెడ్జ్ టెక్నాలజీస్ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ కోర్సుల ప్రవేశాన్ని పునరుద్ధరించామని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆర్.వి.రాజాకుమార్ తెలిపారు.
గచ్చిబౌలిలోని ఐఐఐటీ ఆవరణలో గల యూనివర్సిటీ కార్యాలయంలో గురువారం ఆయన విలేఖరుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రవేశాల్లోని రిజర్వేషన్ల విధానాలపై కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించగా తాత్కాలికంగా ప్రవేశాలను నిలిపివేశామన్నారు.
అయితే న్యాయస్థానం ప్రభుత్వ ఆదేశాలకు లోబడి, ఈ ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఈనెల 30న నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నామని ఆయన తెలిపారు.