సత్యసాయి సెంట్రల్ ట్రస్టు అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టే విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. కొడికొండచెక్‌పోస్టు వద్ద నగదు తరలిస్తూ దోషులు పట్టుబడినప్పటికీ వారి వెనుక ఉన్న వారి నిజానిజాలను వెలికితీయడంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ అక్రమాలను అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. భక్తుల అనుమానాలను నివృత్తి చేయాలన్నారు.