23, జూన్ 2011, గురువారం

పిల్లలకు స్కూలంటే భయమా?

మళ్లి పాఠశాలలు ప్రారంభమయినాయి. కొత్త డ్రెస్సులు, బూట్లు, పుస్తకాలతో పిల్లలు పాఠశాలకు ఎంత ఉత్సాహంతో పరిగెడుతుం టారు. మరి కొందరు పిల్లలు స్కూలుకు వెళ్ల మని మారాం చేస్తుంటారు. గత సంవత్సరం మా వాడు బాగానే వెళ్ళాడు కాదా...ఈ సంవ త్సరం ఎందుకు వెళ్లడం లేదని తల్లిదండ్రులు అనుకుంటారు. పిల్లలను కోపంతో బెదిరించి ఎలాగోలాగా మళ్లిd స్కూలుకు పంపిస్తారు. కాని స్కూలుకు వెళ్లడానికి గల కారణాలను చాలా మంది తల్లిదండ్రులు తెలుసుకోలేక పోతున్నారు. పిల్లలు ఇలా ఇష్టం లేకుండా పాఠశాలకు పోవ టం వలన మానసిక ఒత్తిడికి గురై చదువుల్లో రానించలేక పోతు న్నారు. వీరికి పాఠశాల అంటేనే భయంతో వణికి పోతుంటారు. పాఠశాలను వీరు జైలులాగా భావిస్తుం టారు. ఇటువంటి స్కూలు ఫోబియా ఉన్న పిల్లల యెడల తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లైతే పిల్లలు పాఠశాలలను దేవాల యాలుగా భావించి చక్కగా విద్యాభ్యాసం కొన సాగించేలాగా చేయవచ్చును.

పిల్లలు బాగా ఉన్నత చదువులు చదవా లని మంచి ఉద్యోగం చేయాలని ప్రతి తల్లిదం డ్రులు కోరుకుంటారు. కాని పిల్లలకు చదు వుతో పాటుగా సామాజిక సేవ, ఆధ్యాత్మికత, యోగ, ఆటలు కూడా నేర్పే ప్రయత్నం చేయాలి. దీని వల్ల పిల్లలకు మానసిక ఒత్తిడి తగ్గుతుంది.

స్కూలు ఫోబియా కారణాలు:

- పాఠశాలలో మాస్టరు చదువుమని దండించటం, పాఠశాలలో సదుపాయాలు సరిగా లేకపోవటం.

- పాఠశాలలో ఆటలకు, సృజనాత్మకతకు సమయం కేటాయించక అస్థమానం చదువమని బెదిరించటం.

- తోటి విద్యార్థుల కంటే చదువులో వెనక బడటంతో టీచర్‌ నిత్యం మందలించటం.

- కొత్తగా స్కూలుకు వెళ్లే చిన్న పిల్లలు తల్లిదండ్రులను ప్రధమంగా వదిలి వెళ్లుట వలన భయంతో ఏడుస్తుంటారు.

- పాఠశాలలో తోటి విద్యార్థులు దౌర్జన్య పూరితంగా నిత్యం వేదించటం.

- పాఠశాలలో కఠినమైన నిబంధనలు ఉండటం.

భయం-లక్షణాలు :

- చెమటలు పట్టడం, కాళ్లు చేతులు వణుకు రావడం.

- ఆకలి తగ్గి ఆహారం సరిగా తీసుకోక పోవడం.

- ఆలోచనలతో నిద్ర పట్టకపోవటం.

- మాటలు తడబడటం. ఎవరితో సరిగా మాట్లాడలేక పోవడం.

- వీరి ప్రవర్తన బాధ్యతారహితంగా వుంటుంది.

- ఏ పనిపై శ్రద్ద పెట్టకపోవడం, పనులను వాయిదా వేయటం

-ఏకాగ్రత లోపించటం, తలనొప్పి రావడం

-తమలో తామే బాధ పడటం వంటి లక్షణా లతో ఉంటారు

ఏం చేయాలి?

-పిల్లలు పాఠశాలకు వెళ్లాలంటే భయపడు తున్న కారణాలు తెలుసుకొని, వారిని నెమ్మదిగా నచ్చజెప్పాలి.

-పాఠశాల యాజమా న్యంతో, పాఠశాలలో బో ధించే టీచర్స్‌తో మాట్లాడి వివరణ తీసుకోవాలి.

- పాఠశాలకు వెళ్లా లంటే భయపడుతున్నా రని పాఠశాలకు పం పుట మానుకోవద్దు. అలా చేస్తే వారికి ఎప్ప టికి పాఠశాలంటే భయమే ఉంటుంది.

- వారికి ఉన్న సందేహాలను, భయా లను తొలగించి నచ్చ జెప్పి పాఠశాలకు దగ్గర ఉండి కొన్ని రోజులు తీసు కెళ్లాలి. తల్లిదండ్రులు పిల్లలతో స్నేహంగా వుండాలి.

- వారికి పాఠశాల మీద శ్రద్ద కలిగించే ఆదర్శవంతమైన మంచి మాటలు చెప్పి స్కూలుకు పంపే ప్రయత్నం చేయాలి.

చికిత్స

హోమియో వైద్య విధానంలో ప్రతి ఔషధం మానసిక లక్షణాలతో కూడి ముడిపడి వుంటుంది. కావున మానసిక రుగ్మతలకు హోమియో ఒక వరం. మందుల ఎంపికలో కూడా మానసిక శారీరక తత్వాన్ని ఆధారంగా చేసుకొని మందులను సూచించడం జరుగు తుంది కనుక సమూలంగా రుగ్మతలను చేయ డం సాధ్యం అవు తుంది.

మందులు :

ఆర్జెంటం నైట్రికం :

వీరు ఏ పని తలపెట్టాలన్నా గందర గోళం లో పడిపోతుంటారు. రేపు స్కూలుకు వెళ్లా లంటే ఈ రోజు రాత్రి వీరికి నిద్రపట్టదు. పాఠ శాల సమాయని కంటే ముందే స్కూలుకు వెళ్లాలనుకుంటారు. మానసిక స్థాయిలో ఈ రోగికి పంచరాద, తీపి అంటే ప్రాణం. వీరు లిఫ్ట్‌లో వెళ్లాలన్నా రోడ్డు మీద నడవాలన్నా, వంతెన దాటాలన్నా భయాందోళనకు గురౌ తారు. ఇటువంటి లక్షణాలుండి స్కూలంటే భయపడే వారికి ఈ మందు బాగా పని చేస్తుంది.

ఎకోనైట్‌ : స్కూలుకు వెళ్లే ముందు 'టెన్షన్‌' పడేవారికి ఈ మందు తప్పక పని చేస్తుందను కోవటం లో ఎలాంటి సందేహం లేదు. వీరికి మానసిక స్థాయిలో ఆందోళన, అస్తిమితం, ఉద్వేగపూరితమైన భయానికి లోనవుతారు. వీరికి నాడి వేగంగా, బలంగా కొట్టుకుంటుంది. వీరికి జన సమూహం, చీకటి అన్నా ఎక్కువగా భయంతో వీరు నిద్రలేమితో బాధపడుతుంటారు. ఇటువంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు వాడినచో చక్కని ఫలి తం వుంటుంది.

జెల్సిమియం:

విద్యార్థులు స్కూ లంటేనే భయంతో పాటుగా తత్తరపడి పోతారు. తత్తర పాటుతో విరేచ నాలు కావడం ఈ రోగి గమనించద గిన ప్రత్యేక లక్ష ణం. పాఠశాలంటేనే వణుకు, దడ, తలనొప్పి మొదలవుతుంది. మూత్ర విస ర్జన అనంతరం తలనొప్పి తగ్గిపోవుట ఈ రోగి యొక్క మరొక విచిత్ర విశిష్ట లక్షణం. ఇలాంటి లక్షణాలున్న వారికి ఈ మందు ప్రయో జనకారి.

ఈ మందులే కాకుండా కాల్కేరియాఫాస్‌, జెన్సింగ్‌, సెఫియా, ఫాస్ఫరస్‌, బెల్లడొనా, కాల్కే రియా కార్బ్‌, సల్ఫర్‌, జింకం మెట్‌, ఆరంమెట్‌ వంటి మందులను లక్షణ సముదాయంను అనుసరించి డాక్టర్‌ సలహా మేరకు వాడుకొని స్కూలు ఫోబియా (భయం) నుండి విముక్తి పొందవచ్చును.

- డా|| పావుశెట్టి శ్రీధర్‌