సరిగ్గా సంవత్సరం క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో తనను గెలిపిస్తే బంగారు పల్లెంలో తెలంగాణ తె స్తానని వ్యాఖ్యానించిన డీఎస్ ఫలితాలు తారుమారు కావడంతో పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగినా తెలంగాణ విషయంలో ఏనాడూ పల్లెత్తు మాటైన అనకపోవడం గమనార్హం. పార్టీలకతీతంగా తెలంగాణ సాధన కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా డీఎస్ పేర్కొన్నారు. ప్రోఫెసర్ జయశంకర్ ఆకస్మిక మరణం తెలంగాణ వాదులకు తీరనిలోటని తెలిపారు. జయశంకర్ ఆత్మ శాంతించాలంటే ఆయన చిరకాలవాంఛ అయిన తెలంగాణాను అతిత్వరలో తేవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం అతిత్వరలో నిర్ణయం తీసుకుంటుందని శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు