ఎన్టీఆర్ బతికుండగానే వైస్రాయ్ హోటల్ వద్ద ఆయనపై చంద్రబాబు నాయకత్వంలోని నేతలు చెప్పులు, బూట్లు విసిరిన సంగతి టీడీపీ నాయకత్వం మర్చిపోయిహన్మకొండలో ఎన్టీఆర్ విగ్రహంపై చెప్పులు విసరటంపై టీడీపీ నేతలు నానాయాగీ చేస్తున్నారని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్ ధ్వజమెత్తారు. ఆవేశంలో విగ్రహంపైకి చెప్పులు, రాళ్లు విసరటాన్ని టీడీపీ నేతలు పెద్దది చేయటం సరికాదని చెప్పారు