23, జూన్ 2011, గురువారం

తిరుమలలో మొరాయించిన రోటీ యంత్రాలు

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన రోటీ యంత్రాలు మొరాయించాయి. దీంతో ఉత్తర భారతదేశ భక్తులు రోటీలు లేక ఇబ్బంది పడ్డారు. ఈ యంత్రాలను ఉత్తర భారతదేశం నుంచి కాకుండా పొరుగునే ఉన్న తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి కొనుగోలు చేశారు. నూతన అన్నదాన భవనంలో జూలై మొదటి వారం నుంచి భక్తులకు రోటీలతో కూడిన భోజనాన్ని పూర్తి స్థాయిలో అందించాలని టిటిడి నిర్ణయించింది. అయితే ఆదిలోనే హంసపాదు అన్న చందంగా ఈ యంత్రాలు చెడిపోయాయి. రోటీల తయారీలో పేరెన్నిక గన్న ఉత్తర భారతదేశ యంత్రాలు తేకుండా ఏమీ తెలియని పొరుగు రాష్ట్రం నుంచి తేవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని సిబ్బంది అంటున్నారు.