గన్‌ఫౌండ్రిలోని మహబూబియా పాఠశాలలో నూతన భవన ప్రారంభోత్సవానికి గురువారం ముఖ్యమంత్రి వచ్చిన సందర్భంలో సమయం సరిపోదనే ఉద్ధేశ్యంతో కలెక్టర్ వందేమాతరం, జాతీయగీతం పాడవద్దని చెప్పడం దారుణమని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు నర్రా భూపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరాజులు గురువారం ఓ ప్రకటనలో ఖండించారు.
కలెక్టర్ నటరాజన్ గుల్జార్ వందేమాతరం, జనగణమన పాడవద్దని చెప్పడం జాతిని అవమానపరచడమేనని జిల్లా కలెక్టర్ ఇలా వ్యవహరిస్తే, మిగతా వారి పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు.