భగవాన్ శ్రీసత్యసాయిబాబా శివైక్యం చెందడంతో రేగిన కలకలం క్రమేణా సర్దుకుంటోందని, అయితే ట్రస్టు సభ్యులు నిజాల్ని బహిర్గతపరచాల్సి ఉందని సత్యసాయిబాబా ప్రసంగ అనువాదకుడు ప్రొఫెసర్ అనిల్‌కుమార్ పేర్కొన్నారు. సాయిభక్తులకు ట్రస్టుతో సంబంధం లేదని, తిరుపతి తరహాలో బాబా దర్శనానికి వచ్చేవారన్నారు. అయితే భక్తులు సందిగ్ధ స్థితిలో ఉన్నారని, నిజాల్ని తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారన్నారు. పలువురు తనకు ఫోన్ ద్వారా ఈ వి షయాన్ని తెలుపుతున్నారన్నారు. కొందరు భక్తులు ట్రస్టు వ్యవహారాలపై జీర్ణించుకోలేక పోతున్నారని, అయితే బాబాపై ఏమాత్రం నమ్మకం తగ్గలేదన్నారు. ట్రస్టు సభ్యులు సమష్టిగా, సమైక్యంగా నిజాలను తెలియజేయాల్సి ఉందన్నారు.