2011 సంవత్సరంలో రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలు (డిస్కంలు) అలవికాని సమస్యలతో సతమతమ వుతున్నాయి. ప్రత్యేక తెలంగాణ కోసం పార్లమెంటులో బిల్లు పెట్టాలని ఉద్యో గులు సెప్టెంబర్ 13, 2011 నాడు ప్రారంచిన సకల జనుల సమ్మెతో సింగరేణి కాలరీస్ కంపెనీ అతలాకుతలం అయ్యింది. దీంతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి స్తంభించింది. రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్నాటక ప్రాంతాల థర్మల్ విద్యు త్ ప్రాజెక్టులకు బొగ్గు సరఫరా పూర్తిస్థాయిలో జరగక ఇబ్బందులకు గురయ్యా యి. దీనికి తోడు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలలో గుణాత్మక మార్పుల వలన విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. ఏకంగా ఆ డిమాండ్ 280 మిలియన్ యూనిట్లకు చేరడంతో ప్రజలు విలవిలలాడారు. డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తి జరగకపోవడంతో విద్యుత్ లోటు 50 మిలియన్ యూనిట్లు ఉంటూ వచ్చింది. ఈ లోటును సర్దుబాటుచేయలేక ప్రజలపై కోతలను అమలుచేశారు. రాష్ట్ర రాజ ధానిలో 2 నుండి 4 గంటలు, జిల్లా కేంద్రాల్లో 4 నుండి ఆరుగంటలు, మం డల కేంద్రాలు, మున్సిపాలిటీలలో ఆరు నుండి ఎనిమిది గంటల విద్యుత్ కోత లు విధించారు. అంతేకాకుండా పరిశ్రమలకు కూడా వారంలో మూడు రోజులు పవర్ హాలిడే ప్రకటించారు.
సమ్మె తరువాత మారని విద్యుత్ సరఫరా పరిస్థితి
తెలంగాణ ప్రాంతంలో చేపట్టిన సమ్మె 42 రోజుల తర్వాత ముగిసింది. ఆతర్వాతైనా విద్యుత్ ఉత్పత్తి, సరఫరాలో ఏ మాత్రం మార్పు రాలేదు. ముఖ్యంగా విద్యుత్ డిమాండ్ ఏమాత్రం తగ్గక పోవ డంతో పూర్తి సంకటంగా మారింది. కోతల విషయంలో కొంత మార్పు వస్తుందని ఆశించినప్పటికి వాతావర ణంలో అదేస్థాయిలో ఉష్ణోగ్రతలు కొనసాగుతుండ టం తో విద్యుత్ కోతలు యధాతథంగా అమలు చేస్తున్నారు. విద్యుత్ లోటును బర్తీ చేసేందుకు బయటి నుండి రోజుకు 7 కోట్లు ఖర్చుచేసి విద్యుత్ కొనుగో లుచేశారు. సుమారుగా గత ఆరునెలలో రూ. 600 కోట్లను విద్యుత్ కొనుగోలుకు వెచ్చించారు.
కష్టకాలంలో చేయిచ్చిన జల విద్యుత్ ప్రాజెక్టులు
రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు ప్రారంభంలోనే జలాశయాల్లో నీరులేక జల విద్యుత్ ప్రాజెక్టల్లో ఉత్పత్తి ఆగిపోయింది. ఇందులో ప్రధానంగా శ్రీశైలం, నాగార్జున సాగర్, సింగూరు జలవిద్యుత్ ప్రాజెక్టుల్లో నీరు లేకపోవడం వలన ఉత్పత్తి స్తంభించింది. జల విద్యుత్ ప్రాజెక్టుల ఉత్పత్తి సామర్థ్యం 3,829 మెగా వాట్లు కాగా, ఇందులో ఉత్పత్తి 6 మిలియన్ యూనిట్లకు పడిపోంది. జల విద్యుత్‌ను 8 వేల మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేయాల్సి ఉండగా, 6 వేల ఎంయులు మాత్రమే ఉత్పత్తి జరిగినట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ నేప థ్యంలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా భారమంతా థర్మల్ విద్యుత్ సెక్టార్ పడింది. ఈ రంగంలో ఉత్పత్తి సామర్థ్యం 5093 మెగావాట్లు కాగా, ప్రాజెక్టు లోడ్ ఫ్యాక్టర్ (పిఎల్‌ఎఫ్)ను దాదాపు ఎపి జెన్కో 90 శాతానికిపైగా సాధిం చింది. అదేవిధంగా గ్యాస్ కూడా పూర్తి స్థాయిలో రాలేదు. 75 శాతం రావాల్సిన గ్యాస్ 55 శాతానికి పడిపోవడంతో గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులు పూర్తి సామర్థ్యంతో పనిచేయలేకపోయాయి. కొత్త సంవత్సరంలో కెటిపిఎస్ కొత్త గూడెం 500 మెగావాట్ల యూనిట్‌తో పాటు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు 39 యూనిట్ల ప్లాంట్‌ను జాతికి అంకితం చేశారు. ఎద్దుమైలారం వద్ద 400 కెవి సబ్ స్టేషన్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. నాణ్యమైన విద్యుత్ సరఫరాకు సబ్ స్టేషన్ వ్యవస్థ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రజలపై 4,950 కోట్ల అదనపు భారం కోసం కసరత్తు
రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు, కోతలు ప్రజలను పట్టిపీడిస్తుండగా మరో వైపు విద్యుత్ సంస్థలు ప్రజలపై అదనంగా 4,950 కోట్ల భారాన్ని మోపేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈమేరకు డిసెంబర్ 26 నాడు రాష్ట్రం లోని నాలుగు డిస్కంలు విద్యుత్ చార్జీలను పెంచుకునేందుకు ఎపి ఈఆర్‌సిని అనుమతి కోరాయి. చార్జీల పెంపును సమాజంలోని అన్ని వర్గాల వారికి వర్తింపచేస్తూ, ప్రతిపాదనలను తయారు చేశాయి. ఇందులో వ్యవసాయం, చేతి వృత్తుల వారికి పెంపు నుండి మినహాయింపు నిచ్చాయి. సాధారణ వినియో గదారులు, వాణిజ్య వర్గాలు, పరిశ్రమలు ఇలా అన్ని వర్గాలపై పెద్ద ఎత్తున భారం మోపేందుకు సిద్ధపడ్డాయి.