1, జనవరి 2012, ఆదివారం

అబ్రకద'బ్రా'

మహిళలు ఎంపిక చేసుకునే దుస్తుల్లో విశేష ప్రాధాన్యత కలిగింది 'బ్రా'నే...
ఇది కేవలం అందాలకు... ఆకర్షణకు మాత్రమే పరిమితం కాదని...
ఛాతి ఆకృతిని కప్పి ఉంచడంతో పాటు ఆరోగ్యాన్ని... ఆత్మ విశ్వాసాన్ని కలుగ చేస్తాయని...
సరైన జాగ్రత్తలు తీసుకుని వీటిని కొనుగోలు చేసుకోకుంటే... ఇబ్బంది తప్పదంటున్నారు నిపుణులు
మగాళ్ల మనసుల్ని దోచేలా ముగువలున్నారంటే... వారి అందమొక్కటే కాదు... అనేక అంశాలు అందుకు ప్రాధాన్యలుం టాయి. వీటిలో చెపðకోదగ్గ వాటిలో వారు ధరించే బ్రా ప్రధాన భూమిక పోషిస్తుందనటంలో సందేహంలేదు. మరి ఇంతలా అందర్నీ కట్టిపడేస్తున్న బ్రా కధాకమామిషేంటని ఓసారి పరిశీలిస్తే...
చరిత్ర ఇదీ...
పూర్వకాలంలో వక్షోజాల చుట్టూ పలుచని వస్త్రాన్ని బిగుతుగా కట్టి, ఆపై రవిి (జాకెట్టు) ధరించేవారు. ఇది సాంప్రదాయబద్ధగా ఉండటమే కాకుం డా వైద్యపరంగానూ ఆరోగ్యకరమైనదని... అలాగే జాకెట్టు నుండి ఛాతీ ని బహిర్గతం చేయకుండా ఉండేందుకు ఉపయుక్తంగా ఉండేదని చెపా ్తరు. ఇదంతా 1900 సంవత్సరానికి ముందు మాట. 1500 ఏళ్ల క్రితం వెూకాళ్ల చికిత్స కోసం ప్రత్యేకంగా మెత్తని బట్టతో రూపొం దించిన ప్యాడ్‌ల నుండి ప్రేరణ పొందిన లండన్‌కి చెందిన కొందరు డిజైనర్లు 20 శతాబ్ధం తొలినాళ్లలో పాలిండ్లని దాచి ఉంచేలా బిగుతైన దుస్తుల తయారీని చేపట్టి ప్రయోగాత్మకంగా వినియోగించారు. కాలక్రమంలో అనేక హంగులు రూపుదిద్దుకుని, నేడు లోదుస్తులలో తన ప్రత్యేకతని ఎప్పటికపðడు నిరూపించుకునేలా నేటి మహిళల్ని తన అక్కున చేర్చు కుని కొత్త అందాలతో మెరిపించేలా... చేస్తున్న బ్రాల గురించి ఎంత చెప్పినా తక్కువే అంటున్నారు ఫ్యాషన్‌ డిజైనర్లు. బ్రాలు వచ్చిన తొలి నాళ్లలో ఎగబడినా... వాటి వల్ల కొన్ని రకాల ఇబ్బందులు ఏర్పడుతున్న ట్లు గుర్తించి 1960 ప్రాంతంలో కొన్నాళ్లు దూరమైపోయారు మహిళ లు. ఆపై అనేక రకాల ప్రయోగాల అనంతరం సౌకర్యవంతంగా ఉండే బ్రాలను వివిధ రూపాల్లో తిరిగి ప్రవేశపెట్టడంతో... మహిళలు తమ మనసులు పారేసుకున్నారనే చెప్పక తప్పదు. నేడు వివిధ రంగుల్లో కూడా బ్రాలు లభ్యం అవుతుండటం..ఏ డ్రస్‌ ధరించినా బ్రా ధరించ కుంటే..నగుబాటే అన్న స్ధాయికి చేరుకోవటంతో వీటి అమ్మకాలు బాగా పెరిగిపోయాయన్నది వాస్తవం. ఒకపðడు కేవలం జాకెట్‌ మాత్రమే ధరించే మహిళల్లో సైతం బ్రా వల్ల ఉపయో గాలు తెలిసొచ్చి ఏ కొద్ది మందో మినహా ప్రపంచవ్యాప్తంగా సుమారు 92 శాతం మంది మహిళలు బ్రాలని వాడేందుకే మక్కువ చూపుతున్నారని ఓ సర్వే చెపుతోంది. సర్వ సాధారణంగా మన మర్కెట్లలో స్పాంజ్‌ బ్రా, నైలన్‌, కాటన్‌ బ్రాలు ఉంటా యి. అయితే మన శరీరాకృతికి సరిపడ విధంగా బ్రా వాడకుంటే అందాలు పెరగటం మాట అటుంచి జారినట్లు కనిపించి ఉన్న అందాన్ని చెడగొడ తాయి. అందువల్లే బ్రా ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..
బ్రాల ఎంపిక ఇలా...
మహిళలు తాము ధరించే దుస్తులకు అనుగుణంగానే కాదు శరీరం ఆకా రాన్ని కూడా పరిగణలోకి తీసుకుని బ్రా ఎంపిక చేసుకోవాలి. మెడ వరకు జాకెట్‌ వేసుకునే వారు చుడీదార్లు, మిడ్డీలు ధరించేపðడు వాటికి అనుకూ లంగా.. షేపులకు సరిపడ ఫుల్‌ కప్‌ బ్రాలనే వాడాలి. పిల్లలకు పాలు పట ే్టవారు అందుకు డబుల్‌ కప్‌ బ్రాని ఎంపిక చేసుకుంటే సౌలభ్యంగా ఉంటుం ది. రాత్రుళ్లు నైట్‌ డ్రస్‌లు, నైటీలు వేసుకునే అలవాటు ఉన్న వారు ఈజీ బ్రాని, వ్యాయామం చేసే వారు కాటన్‌ బ్రా వాడటం మంచిది. మీరు మీకు తగ్గ బ్రాలని కొనుగోలు చేయటంలో ఎంత శ్రద్ద చూపిస్తారో.. స్ట్రాప్‌ విష యంలోనూ అంతే శ్రద్ద చూపించాలి. వెడల్పు తక్కువగా ఉండే స్ట్రాప్‌లు వేసుకొంటే అవి వక్షస్ధల భారాన్ని వెూయలేవు. ముందువైపు హుక్కుల కన్నా. వెనక వైపు హుక బ్రాలైతే.. బాగా పట్టి ఉంచుతాయి. స్థనభాగం బైటకు కని పించని విధంగా మీ బ్రా ఎంపిక ఉండాలి. మీరు వెళ్లిన సమయానికి షాప్‌లో మీకు తగ్గ బ్రా దొరకక పోతే మరో షాప్‌కు వెళ్లండి. అంతే కానీ ఏదో ఒకటని కొనేస్తే మీ శరీరా కృతి మారిపోయే ప్రమాదం ఉంది. వీలైనం త వరకు బనియన్‌క్లాత్‌తో తయారు చేసిన బ్రాలనివాడితే ఒంటికి హత్తుకుని హాయిని కలిగి స్తాయి. అలాగే కాటన్‌ బ్రాలు కూడా.డెలివరీ అయిన మహిళల్లోస్తనాలు పాలతో బరువెత్తి ఉంటా యని ఇలాంటి స్ధితిలో బ్రా వాడకుంటే ఇబ్బందులు పడాల్సివస్తుందని వైద్యులు చెప్తు న్నారు.
అయితే ఈ మహిళలు పై కపðలు ఉండే నర్సింగ్‌ బ్రాని వేసుకో వాల్సి ఉంటుందని ఇది బిడ్డకి పాలిచ్చేందుకు కూడా ఇబ్బంది లేకుండా చూస్తుందని వెల్లడించారు.
ఓవేళ ఎద అందాలు యధా స్ధానంకి రావాలన్న తపన తో టైట్‌గా ఉండే బ్రా వాడితే పాలు ఆగి పోతాయని... మరీ లూజ్‌గా వాడితే స్తనాలు జారి పోతాయి కనుక సరిగ్గా సరిపోయేవాటిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.
అలాగే ప్రస్తుతం మార్కెట్‌లో డ్రాప్‌ కప్‌ బ్రాలు, జిపð బ్రాలు సైతం డెలివరీ మహిళల కోసం దొరుకుతున్నాయని, ఇవి సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా పబ్లిక స్ధలాల్లో కూడా పిల్లలకు పాలు ఇచ్చేందుకు ఇబ్బంది లేని విధంగా ఉంటాయని వ్యాపారులు చెప్పారు.
ఏదో ఒకటి అనుకుంటే...
బ్రా అన్నది కేవలం అందం కోసమే కాదు ఆరోగ్యాన్ని కూడా కాపాడేది అన్నది చాలా తక్కువమందికి తెలుసు. అయితే ఏదో ఓ బ్రా కొనేసుకున్నాం. వేసేసుకున్నాం అన్న తీరులో పోతే, వెన్ను నొప్పి, తలనొ ప్పి, మెడనొప్పితో పాటు రొమ్ము క్యాన్సర్‌ వచ్చే ఆస్కారం కూడా ఉందన్నది వైద్య నిపుణుల హెచ్చరిక. కొంతమందికి బ్రా వేయకుండా ఉంటే ఏదో కోల్పోయినట్లుంటా రు. రోజులో 24 గంటలు బ్రా ధరించే వారిలో రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవ కాశాలు ఎక్కువగా ఉన్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సిడ్నీకి చెంది న వైద్య పరిశోధకులు రాస్‌ సింగర్‌, సోమ గ్రీస్‌మైజర్‌ల నేతృత్వంలో వైద్య బృందం చేసిన వివిధ అధ్యయనాలలో 12 గంటల ఆపై బ్రా ధరించిన మహిళల కన్నా 24 గంటలూ బ్రా ధరించే వారిలో రొమ్ము క్యాన్సర్‌ వచ్చిన ట్లు వెల్లడించారు. చాలామంది మహిళల్లో బ్రా ధరిస్తే వెన్ను నొప్పి వస్తోంద న్న భావనఉంది. ఇది వాస్తవం కూడా అయితే ఇందుకు బ్రాఎంపిక సరి లేక పోవటమే ప్రధాన కారణం. లండన్‌కి చెందిన రాయల్‌ ఫ్రీ హాస్పెటల్‌ వైైద్య నిపుణులు డాక్టర్‌ అలెక్స క్లార్క్‌ తన వద్దకు వస్తున్న మహిళల్లో ఎక్కువ మం ది బ్రెస్ట్‌ క్యాన్సర్‌ బారినపడుతున్న వారు ఉండటం పట్ల ఆశ్చర్యపోయి అందు కు గల కారణాలపై పరిశోధన చేయగా ఎక్కువమంది తమ శరీర కొలతల కు తగ్గసైజు బ్రాని వాడకపోవటం వల్ల బ్రా వక్షోజాల భారంతో పాటు భుజా ల బరువునీ వెూయాల్సి రావటంతో వెన్నునొప్పికలుగుతోందని తేలిందన్నారు.
ప్రపంచవ్యాప్తంగా బ్రాని ధరిస్తున్న మహిళ ల్లో 90 శాతం మందికి తామెలాంటి బ్రా కొనుగోలు చేసుకోవాలన్న అవగాహన కూడా లేదని.. కంటికి కనిపించింది కొనేస్తూ.. ధరిస్తుండటం వల్ల మెడనొప్పి , వెన్ను నొప్పి సమస్యలు వస్తున్నాయని ఒక్కో సారి రొమ్ము క్యాన్సర్‌కి
దారి తీస్తుండ టంతో బ్రాలు కొనేం దుకైన ఖర్చు కన్నా.. ఆపరేషన్‌కి అవుతున్న ఖర్చు అధికంగా ఉంటోందని పలువురు అభి ప్రాయ పడ్డారని... ఇదే అంశంపై అధ్యయనం చేసిన లండన్‌లోని సెయింట్‌ జార్జ్‌ ఆస్పత్రికి చెందిన బ్రెస్ట్‌ సర్జన్‌, ప్రొపె ˜సర్‌ కేఫా వెూకబెేల్‌ వెల్లడించడం ఆసక్తికరం. గత ఇరవై ఏళ్లుగా బ్రా వాడకాలలో పెనుమార్పులు సంభవించాయని... టీనేజ్‌ అమ్మాయిలు మొదలు 30 ఏళ్ల యువతులు వరకు తమ ఎద అందా లపై తీవ్ర శ్రద్ద పెడుతున్నారని... ఆహార అలవాట ్లలోనూ వారు తీసుకుం టున్న అతిజాగ్రత్తలతో బి సైజ్‌ బ్రాలు వాడే వారు కేవలం ఒకటి రెండేళ్లలో ఎఫ్‌, జి సైజులు వాడుతుండటం ఆశ్చర్య కరంగా ఉందని ఇందుకు స్త్రీలలో హార్మోనుల తేడా రావటం కూడా ఓ కారణంగా ఆరోగ్య నిపుణులు వెల్లడిం చారు. బక్క పల్చగా ఉన్న టీనేజ్‌ అమ్మాయిలు ఎదుటివారిలా తామూ పుష్టిగా తయారవ్వాలని ప్రత్యేక వ్యాయామాలకు వెరవట్లేదని, కొవ్వుగల ఆహార పదార్థాలు తీసుకుంటు న్నారని..దీంతో చిన్న వయసులోనే వయసుకు మించిన బరువు రావటం తో ఎక్కువ మంది ఎఫ్‌10 సైజ్‌లు వాడాల్సి వస్తోందని చెప్పారు. తొలినాళ్ల లో ఇది ముచ్చటగా ఉన్నా...రాను రాను కొవ్వు పదార్ధాల కారణం గా అనేక రుగ్మతలు కలిగి ఇబ్బందులు పడాల్సి వస్తుందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని తల్లిదండ్రులు పిల్లల్ని ఓ కంట కనిబెట్టాలని హెచ్చరిస్తున్నారు.
సరిలేకుంటే... అంతే...
శరీరాన్ని బిగుతుగా పట్టి ఉంచేలా ఉండే దుస్తులకు ఎక్కువగా నేటి యువత ఆకర్షింపబడుతున్న క్రమంలో బ్రా ఎంపిక కూడా చాలా జాగ్రత్తగా జరగాల ని... శరీరాకృతిని మార్పు చేసేలా బ్రాలుంటాయన్న విషయాన్ని పరిగణన లోకి తీసుకోవాలని సూచిస్తున్నారు ప్రముఖ బ్రా తయారీ సంస్ధ డెబెన్‌ హామ్స్‌కు చెందిన కారోలిన్‌ ఆడమ్స్‌.
ప్రపంచవ్యాప్తంగా మహిళలు జీన్స్‌, ఇతర డ్రస్‌లపై వాడే బ్రాలలో మిగి లిన వాటికన్నా... పుషప్‌ బ్రాల నే ఎక్కువగా ఇష్టపడుతు న్నా రని తాము ఇటీవల నిర్వ హించిన సర్వేలో వెల్లడై నట్లు చెప్పారాయన. ఇక స్ధనాల వృద్ధి కోరు కునే వారు అందుకు అను గుణంగా తయారై న పుష్‌ ఆప్‌ బ్రాల ని వాడితే ఫలితం ఉంటుందని పబ్లిసిటీ ఎక్కువ కావటంతో పాటు ఇవి ఆధునిక ప్రమాణాలతో ఎంతో సౌకర్యవంతంగా ఉండటంతో వీటిని కొనేందుకు ఎక్కువ మంది ఉత్సా హం చూపిస్తున్నారని... దీంతో వీటి అమ్మకాలు బాగా పెరిగినట్లు వ్యాపారు లు చెప్తున్నారు.
ప్రత్యేక కౌంటర్లు
నిన్న మెన్నటి వరకు లో దుస్తులు ఖరీదు చేసేందుకు షాపులకు వెళ్లినా అడిగేందుకు చాలా ఇబ్బంది పడే వారు మహిళలుఅందునా ఆయా షాపులలో మగ వాళ్లుఎక్కువగా ఉండటంతో చేతికి అందిన దాన్ని తీసుకుని సొమ్ము చెల్లించి చటుక్కున వచ్చేసే వారు.
ఇలా తాము తెచ్చుకున్న బ్రా వదులు అవ్వటవెూ మరీ టైట్‌ అయిపోయి.. సౌఖ్యంగా లేక పోవట వెూ జరిగితే సరిపెట్టుకునేవాళ్లు. దీనివల్ల ఇబ్బం దులు, రోగాల బారిన పడిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
అయితే నేడు ఇన్నర్‌ వేర్స్‌ పేరుతో పలు చోట్ల ప్రత్యేక షాపులు వెలియగా... షాపింగ్‌ మాల్స్‌లో వీటికోసం ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేయటమే కాకుండా మహిళలు పడుతున్న ఇబ్బం దులు దృష్టిలో ఉంచుకుని ఆయా కౌంటర్లలో మహిళల్నే సేల్స్‌కు నియమిస్తుం డటంతో పాటు అనేక రంగు రంగులు, అనేక డిజైన్లు, ఏ వయసుకు తగ్గట్టుగా వివిధ సైజుల్లో లభించ డంతో ఓ విధంగా ఊరట లభించినట్లే... మార్కెట్‌లో ఎన్నో కంపెనీ లు తమ ప్రోడక్టులని అందిస్తున్నాయి. వీటిలో బేర్‌ నెససిటీస్‌, మెయిడిన్‌ ఫార్మ్‌, విక్టోరియా సీక్రెట్‌ తదితర బ్రాండ్లు అందిస్తోన్న క్వర్టబల్‌, స్టార్ప్లస్‌. ఫుల్‌ కవరేజ్‌ డెమి బ్రాస్‌ ఇలా పలు ఆకృతు లలో లభ్యమవుతున్నాయి.
బ్రా ఖరీదు 12 కోట్లు...
మహిళల ఇన్నర్‌ వేర్స్‌ ఉత్పత్తులలో ప్రపంచంలో అగ్రగామిగా ఉంటున్న విక్టోరియా సీక్రెట్‌ దాదాపు 10 కోట్ల విలువైన బ్రాని మార్కెట్‌లోకి విడుదల చేసి బ్రా ప్రాధాన్యతని తెలియచేసింది. 3 వేల పైచిలుకు వజ్రాలతో రూపొందించిన ఈ బ్రాని విక్టోరియా బ్రాండ్‌ అంబాసిడర్‌ హాలీవుడ్‌ భామ అడ్రియానాతో ధరించి మన్‌ హట్టన్‌ వీధిలో షికార్లు చేయటం విశేషం కాగా...మరో వైపు విక్టో రియా సీక్రెట్‌ షోల పాల్గొని సూపర్‌ వెూడల్‌ ఆఫ్‌ వరల్డ్‌గా సత్తా చాటిన అడిరైనా లైమా న్యూయార్కులో జరిగిన ఫ్యాషన్‌ షోలో ధరించిన ఫాంటసీ బ్రా మిరుమిట్లు గొలిపింది. 3,575 బ్లాక డైమండ్లు, 117 సర్టిపైడ్‌ 1 క్యారెట్‌ వైట్‌ రౌండ్‌ డైమండ్‌, 34 రుబీస్‌ వంద క్యారెక్టర్ల ఉన్న రెండు బ్లాక డైమండ్లు తో తయారు చేసిన ఈ బ్రా ఖరీదు 5 మిలియన్‌ డాలర్ల పైమాటే. అన్నట్లు ఈ బ్రాని ధరించి ప్రదర్శనలో పాల్గొన్నందుకు 1.5 మిలియన్‌ల డాలర్లు పారితోషకం అందివ్వటంతో జ్యూయలరీ బ్రాలకి కూడా ప్రపంచ వ్యాప్త డిమాండ్‌ ఉన్నట్లు పరిశీలకులు చెప్తున్నారు.
ఆస్ట్రేలియా సైపర్‌ వెూడల్‌ మిరందా కెర్‌ ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన విక్టోరియా సీక్రెట్‌ ఫ్యాషన్‌ పెరేడ్‌లో 12.75 కోట్ల విలువైన బ్రాని ధరించి జనం విస్తుపోయేలా చేసింది. ఈ బ్రా కోసం 3,400 రత్నాలు, 142 క్యారెట్‌ విలువ ఉన్న పసుపు, తెలుపు వజ్రాలు, ముత్యాలు18 క్యారెట్స్‌ తో కూడిన బంగారు లతలతో అద్భుతమైన ఆర్ట్‌ వర్క్‌తో కూడిన ఈ బ్రాని చూసేందుకు ఎందరో ఎగబడగా... ప్రత్యేక ప్రసారంలో దీనిని కోట్లాది మంది వీక్షించినట్లు సదరు సంస్ధ ప్రకటించింది.
అంతెందుకు ఇటీవల బాలీవుడ్‌ భామ విద్యాబాలన్‌ నటించిన 'ది డర్టీపిక్చర్‌' పబ్లిసిటీ జనం మతులు పోగొట్టేలా ఉండటంతో తాజాగా విద్యాబాలన్‌ని తమ ఉత్పత్తుల కోసం బ్రాండ్‌ అంబాసిడర్‌ చేసుకునేందుకు కోట్ల రూపా యలలో ఆఫర్స్‌ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అదే 'బ్రా'కున్న ఆకర్షణ!