పర్వతారోహణ అంటే వారికి మక్కువ ఎక్కువ.. మహిళలైనా ఏదో సాధించాలన్న తపన... వారిని ఆ కీర్తి శిఖరాలవైపు నడిపించింది... ఒడిదుడుకులు ఎన్ని ఎదురైనా ధౖైెర్యంగా...కొన్ని వేల రెట్ల ఆత్మవిశ్వాసంతో అడుగులో అడుగు వేసుకుంటూ.... ఉన్నత లక్ష్యాన్ని చేరి....తమ ప్రత్యేకతని నిలుపుకున్న వారు ఎందరో ఉన్నారు....ప్రపంచానికి మగువల సత్తా చూపి...
అందనంత ఎత్తుకు ఎదిగినా... వినయంలోనూ.. తాము హిమగిరులంత గొప్పవారమని చాటుకుంటున్నారు.
బచేంద్రిపాల్
భారతావనిలో తొలిసారిగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మహిళా మణి ఈమె. 1954లో పుటిన ఈమె చిన్న వయసులోనే 21900 అడుగుల ఎత్తులో ఉన్న గంగోత్రిని, 19091 అడుగుల ఎత్తులో ఉన్న రుడుగరియా పర్వతాలను అధిరోహించి జాతీయ సాహస ఫౌండేషన్‌లో ఇన్‌స్ట్రక్టర్‌గా బాధ్యతలు స్వీకరించి..పర్వతాహోరణంలో మహిళలలకు ప్రత్యేకశిక్షణ ఇచ్చే వారు. ఆ క్రమంలో తాను కూడా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహిం చాలని నిర్ణయించుకుని తన పేరు చిరసాయిగా నిలచేలా చేసుకున్నారు.
వివిధ దేశాలకు చెందిన ప్రతినిధుల బృందంలో సభ్యురాలిగా పర్వతోహరణాన్ని ప్రారంభించిన ఆమె లక్ష్యం చేరుకోవాలన్న దశలో వడి వడిగా ముందుకు సాగుతుండగా... తోటివారు.... ఒక్కో క్కరిగా దూరంమవుతున్నా... ఎలాంటి భీతి చెందక కేవలం భారతీయ పతాకం ఎవరెస్ట్ శిఖ రంపై ఎగరాలన్న తప్పనతో ముందుకు సాగింది ఆమె పయనం. దాదాపు 24 వేల అడుగుల ఎత్తు కు చేరుకున్న ధశలో మంచు ఉప్పెన ముంచుకొచ్చి... వరుసగా మంచు పెళ్లలు జారి పడుతున్నా... భయపడక ముందుకు సాగుతున్న తనని చూసి ఆ ఉప్పెనే తప్పుకుందని నవుతూ ఆనాటి సంఘటన గుర్తుకొచ్చిన ప్పుడల్లా చెపుతారామె.
1984మే 17న ఎవరెస్టు శిఖరం అధిరోహించి త్రివర్ణపతాకాన్ని ఎగురేసి భారతావని పేరు ప్రతిష్టలు జగద్విఖ్యాతం చేసారు.
ప్రేమలత అగర్వాల్
ఇద్దరు పిల్లలకు తల్లయ్యి, ఒకమ్మాయికి పెళ్లి చేసాక కూడా పర్వతారోహణపై మక్కువతో ఎవరెస్టు శిఖరమే లక్ష్యంగా నలభై ఏళ్ల ప్రేమలత అగర్వాల్ చేసిన సాహసం యావత్ దేశాన్ని నివ్వర పరిచింది. ఎవరెస్టు ఎక్కిన మహిళలల్లో అతి పెద్ద్ద వయసున్న మహిళగా చరిత్రలో అందనంత ఎత్తుకు ఎదిగి పోయింది.డార్జిలింగ్‌లోని మార్వాడీ కుటుంబంలో పుట్టిన ఆమె చిన్న నాటి నుండి సాహసాలంటే మక్కువ చూపేదని... ఆటపాటల్లో ప్రధ మంగా వచ్చినా... తల్లిదం డ్రులు కూడా వారించే వారు సరికదా.. ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి చివరివరకు కట్టుబడి ఉండాలని చెప్పేవారు. వివాహానంతరం జంషడ్ పూర్‌లో స్ధిరపడ్డా పర్వతారోహంపై మక్కువ వదులుకోలేక పోయింది. సరికదా లక్ష్యం ఎవరెస్టు వైపు ఎగిసింది. ఎవరెస్టు అధిరోహించిన ప్రధమ మహిళ బచేంద్రి పాల్ నేతృత్వంలో శిక్షణ తీసుకుని... ఆమె నాయకత్వంలో 2004లో నేపాల్‌లో జరిగిన ఐలాండ్ పీక్‌ని, ఎక్కిన ఆమె 2006లో 18,300 అడుగుల ఎత్తున్న కారాకోరమ్ పాస్‌ని, 20,150 అడుగుల ఎత్తులో ఉన్న మౌంట్ స్టోక్ కంగ్రీ పర్వతాలను అధిరోహిం చడమే కాకుండా 2007లో ధార్ ఎడారిలో జరిగిన సాహస యాత్రలోనూ పాల్గొని తొలిమహిళగా రికార్డుల కెక్కింది. ఆపై బచేంద్రి పాల్ నేతృత్వంలో ప్రత్యెెక శిక్షణ తీసుకుని 2008లో ఎవరెస్టు ప్రయాణానికి సిద్దమైంది. మార్చి 25న ప్రారంభించిన ఈ పయనం ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా... వెరవక తనతో వచ్చిన వారంతా వెనక్కి తగ్గుతున్నా భయ పడక కృత్రిమ ఆక్సిజన్ సాయంతో 26 వేల పైచిలుకు అడుగుల లక్ష్యం చేరుకునే వరకు సాగించి మే 20న ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించింది ప్రేమలత.నిర్ధిష్ట లక్ష్యం ఉంటే అవాంతరాలెనున్నా ప్రయత్నించి... కృషి చేస్తే చేరుకోవటం సునాయాసమే అనేందుకు ఆమె పెద్ద ఉదాహారణ
సంతోష్ యాదవ్
హర్యానాలోని రెవనీ జిల్లాలోని జొనియావాస్ అనే కుగ్రామంలో సాధారణ కుటుంబంలో జన్మించిన సంతోష్ యాదవ్ రెండు సార్లు ఎవరెస్ట్ ఎక్కిన మహిళగా పేరు సంపాదించుకుంది. 8వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ఆమె ఢిల్లీలో సెకండరీ విద్య అభ్యసిస్తూ... పర్వతోరాహణపై మిత్రులు చెప్పిన మాటలు విని పర్వతాలు చూడాలనే ఉత్సాహంతో అసలు వాటిని ఎక్కేందుకు నైపుణ్యత పెంచుకునేం దుకు ఓ పర్యాటక క్లబ్‌లో చేరారు. ఇలా చెట్లు పుట్టలు ఎక్కుతుంటే నిన్నెవరు పెళ్లాడతారంటూ ఇంట్లో వాళ్లు చీవాట్లు పెట్టి బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తే... జైపూర్ వెళ్లి అక్కడి మహారాణి కాలేజ్‌లో హాస్టల్ చేరి ఓవైపు పర్వతోరాహణపై ఆసక్తిగల అంశాలును తెలుసుకుంటూనే బిఏ పూర్తి చేసి పట్టా పట్టుకుని వచ్చి తల్లిదండ్రులను ఒప్పించి జవహర్‌లాల్ నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మౌంటెనింగ్‌లో చేరారు. 1993లో 15 మంది సభ్యులున్న ఎవరెస్టు పర్వతోరాహకుల బృందంలో స్ధానం దక్కించుకుని ఎవరెస్ట్ ఎక్కిన ఆమె కన్షుగన్ ప్రాంతం నుండి హిమాలయ లెక్కిన మొదటి మహిళగా నిలచి, మరుచటి ఏడాది కూడా మరోమారు అవకాశం దక్కించుకుని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిం చారామె. తనలా పర్వతోరాహణచేయాలనుకునే వారికి శిక్షణ ఇచ్చేందుకు సొంతగా ఇనిస్టిట్యూట్ ప్రారంభించిన ఆమె ప్రకృతికి ఎలాంటి ప్రమాదం జరగని రీతిలో తాను శిక్షణ ఇస్తున్నట్లు తెలిపింది.
మమతా సౌదా
మూమ్మూలు ఆడవారికి సాధ్యం కాదం టూ పర్వతారోహణపై విర్రవీగే వారి నోళ్లు మూత బడేలా ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కి తన సత్తా చూపింది హర్యానాకి చెందిన మమతా సౌదా... ఎవరెస్టు అధిరోహిం చిన వనితల్లో భారతావనిలో చిన్న వ్యక్తిగా తన పేరు చరిత్రలో నిలుపుకుందామె... 18 ఏళ్ల వయసులోనే కఠోర దీక్షతో... ఉన్నత శిఖరాలు అధిరోహించిన ఆమెని యావత్ దేశం ప్రశంసలతో ముంచెత్తగా... 'టెంజింగ్ నార్గె అవార్డు'ని గెలుచు చుకున్న ఆమెని ఇటీవలే రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతులు మీదుగా రాష్ట్ర పతి భవన్‌లో ప్రత్యేకంగా గౌరవించారు.
ట్రీడెడ్ అడ్వంచ ర్స్ టూరిజం వారు నిర్వహిం చిన 15 మంది పర్వతోహరణ బృందంలో 11 మంది బ్రిటన్‌కు చెందిన వారు కాగా... 4గురు భారతీయులు.. వారిలో నాకు స్ధానం దక్కిందన్నప్పుడు నా ఆనందానికి అవధులే లేకుండా పోయాయి. తన లక్ష్య సాధనకు అయిన 21 లక్షల ఖర్చుల్లో హర్యానా పోలీసులు 3 లక్షలు సాయం చేయవటం తో తన ప్రయత్నాలు మరింత వేగవంతం చేసానని తన లక్ష్యం నెరవేరినందుకు ఆనందంగా ఉందని చెప్పారామె. ఎంత శ్రమ పడినా... ఈ ఆనందం ముందు అవి దిగదుడుపే అని చెప్పారు. పర్వతారోహణతోపాటు నేషనల్ హేండ్ బాల్ పేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె ప్రస్తుతం కురుక్షేత్ర యూనివర్శిటీలో ఎంఫిల్ చేస్తోంది.
కృష్ణా పాటిల్
అతి చిన్న వయసులో హిమాలయాలెక్కిన ఈ మహరాష్ట్ర అమ్మాయి ఎవరెస్టుతో పాటు మరో నాలుగు ఖండాలలోని పర్వతాలను అధిరోహించింది.అంటార్కిటికాలో ఎత్తయిన మంచుపర్వతాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళగా పేరు తెచ్చుకుంది. చిన్నప్పటి నుం డి సాహస క్రీడలంటే ఇస్టపడే కృష్ణా ఇక ముందు ఏడు ఖండాలలోనూ ఇలాంటి రికార్డులు సృషిర్టచాలని భావిస్తోంది.
కవిత బుదతోకి
ఉత్తరాంచల్‌లోని డెహ్రాడూన్‌కి చెందిన కవిత చిన్నప్పటి నుండి పర్వతాలుఎక్కడమంటే మక్కువ చూపి, అకుంఠిత దీక్షతో పర్వతాలు ఎక్కడం ప్రారంభించిన ఆమె ఎవరెస్టు బృందంలో స్ధానం సంపాదించి... అవలీలగా ఎవరెస్టు ఎక్కిన తొలి ఉత్తరాంచల్ మహిళగా మన్నలను అందుకుంది. ఎవరెస్టు ఎక్కినప్పుడు ఎలాంటి భయం కలగలేదని... అయితే దిగుతున్నప్పుడు కళ్ల ఎదుటే మంచుతుఫాను కు ఓ విదేశీయాత్రికుడు బలవ్వటం మరువ లననని చెప్పిన కవిత ఇప్పటికి 17శిఖరాలను ఎక్కింది.