మన కొత్త సంవత్సరం ఉగాదితో మొదలైతేనేం జనవరి ఫస్టును ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయం. ఇంకా చెప్పాలంటే దీన్నే సిసలైన న్యూ ఇయర్‌గా సెలబ్రేట్ చేసుకుంటాం. జనవరి 1తో మొదలయ్యే గ్రెగెరియన్ క్యాలెండర్ డిసెంబర్ 31తో ముగుస్తుంది. పన్నెండు నెలల ఈ క్యాలెండర్ ప్లుటార్చ్, మాక్రోబియస్‌ల పద్ధతిని అనుసరించి క్రీస్తుకు పూర్వం 700 నాటి న్యూమా పాంపీలియస్ నాటినుండి అమల్లో వుంది. రోమన్ రచయితలు మొదట్లో సంవత్సరాలకు పేర్లు పెట్టేవారు.అయితే క్రీ.పూ. 153 జనవరి 1 తర్వాత కార్యాలయంలో కాలుపెట్టలేదు. దాంతో జనవరి ఫస్టును వాళ్ళు న్యూ ఇయర్‌గా వేడుకచేయడం ప్రారంభించారు. అయితే ఆ ఒక్కరోజే కాదు, మధ్యయుగం వరకు మార్చి 1, మార్చి 25, ఈస్టర్ పండుగ, సెప్టెంబర్ 1, డిసెంబర్ 25 (క్రిస్టమస్) తేదీలను కూడా కొత్త సంవత్సరంలాగే వేడుక చేసుకునేవారు. ఇక ఇరవయ్యో శతాబ్ద ప్రారంభంలో పాశ్చాత్య నాగరికత మరింత వేళ్ళూనుకుని విస్తృతమయ్యాక జనవరి 1వ తేదీ ప్రపంచానికి పర్వదినం అయింది. చైనా, భారత్ లాంటి దేశాల్లో తమ ప్రాంతీయ క్యాలెండర్లు ఉన్నప్పటికీ న్యూ ఇయర్‌ను ఎంతమాతం విస్మరించకపోగా రెట్టింపు ఉత్సాహంతో జరుపుకోవడం విశేషం.
సిడ్నీలో న్యూ ఇయర్ సందర్భంగా 80 వేల ఫైర్ వర్క్స్ షాపులు వెలిశాయి. ఏకంగా 5 లక్షలమంది అక్కడ హాజరై కేరింతలు కొట్టారు. ఇక ఆ కార్యక్రమాన్ని లైవ్‌లో తిలకిస్తూ పులకించినవాళ్ళయితే కోటానుకోట్లు. అలాగే చిలీలోని వాల్పరైసోలో ఇరవై లక్షలమంది ప్రజలు 21 కిలోమీటర్ల దూరం మేరకు వ్యాపించారు. న్యూ ఇయర్‌ను స్వాగతిస్తూ 25 నిమిషాల మేరకు క్రాకర్లతో ఊపిరాడకుండా చేశారు. థేమ్స్ నది ఒడ్డునున్న ''లండన్ ఐ''లో కళ్ళు జిగేల్‌మనేలా, దేదీప్యమానమైన టపాసులు మారుమోగాయి. అర్ధరాత్రి దాటినా కాసింత ఉత్సాహం తగ్గదు. అందుకే అనేక సంస్థలు న్యూ ఇయర్ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటాయి. న్యూయార్క్ టైమ్స్ స్వ్కేర్‌లో ఒక అతి పెద్ద క్రిస్టల్ బాల్‌ను ఏర్పాటుచేసి దానిమీదే దృష్టిని కేంద్రీకరించి ''టెన్.. నైన్.. అంటూ కౌంట్ డౌన్ మొదలుపెట్టి సరిగ్గా పన్నెండు కాగానే ఉద్వేగం తారాస్థాయికి చేరగా గ్రీటింగ్స్ చెప్పుకుంటారు. స్కాట్‌ల్యాండ్, ఎడిన్‌బరోలో ప్రపంచంలోకెల్లా భారీగా అనిపించే స్థాయిలో హాగ్‌మెనే వేడుకలు జరుపుతారు. స్కాటిష్ భాషలో హాగ్‌మెనే అంటే సంవత్సరంలో చివరిరోజు అని అర్థం. ఈ వేడుకలు ఏకంగా నాలుగు రోజుల పాటు అత్యంత ఘనంగా జరుగుతాయి. ఆ దేశస్తులే కాకుండా చుట్టుపక్కల దేశాల నుండి ప్రజలు హాజరవడంతో ఇసుక వేస్తే రాలనట్టుగా వుంటుంది.
రియో డే జెనీరో, కొపాకబానా బీచ్‌లో ప్రతి సంవత్సరం జరిగే న్యూ ఇయర్ వేడుకలో ఇరవై లక్షలమంది పాల్గొంటారంటే అతిశయోక్తి కాదు. పావుగంట పాటు ఎడతెరిపి లేకుండా క్రాకర్లు హోరెత్తుతాయి. లాటిన్ అమెరికా సంప్రదాయాన్ని అనుసరించి న్యూ ఇయర్ రోజున భవిష్యత్తు ఎలా వుండబోతోంది అనే అంశమై చర్చలు, ఎనాలిసిస్‌లు జరుపుతారు. అంటే మనం ఉగాదిరోజున పంచాంగం తిరగేసినట్లన్న మాట. క్రిస్టియన్ ట్రెడిషన్ ప్రకారం జనవరి 1వ తేదీ పవిత్రదినంగా భావిస్తారు. వారికి ఆరోజు క్రీస్తు దేవదూతగా, జీసెస్‌గా మారినట్లు.
న్యూ ఇయర్ విశేషాలు
శ తూర్పు దేశాల్లోని పన్నెండు అతి పెద్ద సాంప్రదాయ చర్చిల్లో ఎనిమిది చర్చ్‌లు మార్పులు చేర్పులు చేసిన జులియన్ క్యాలెండర్‌ను అనుసరిస్తున్నాయి.
శ బల్గేరియా, సిప్రస్, ఈజిప్ట్, గ్రీస్, రొమేనియా, సిరియా, టర్కీల్లో జనవరి 1వ తేదీనే వేడుక చేసుకుంటాయి.
శ ఫ్రాన్స్‌లో కొత్త సంవత్సర వేడుకలు, అతి ప్రాచీన పద్ధతిలో సంప్రదాయబద్దంగా జరుగుతాయి. ఆరోజు వాళ్ళు ఏం ధరించాలి అనే అంశమై మట్టుకు ఎలాంటి నిబంధనలూ లేవు. ఈ దేశస్తులు జనవరి 1వ తేదీని ''జోర్ డెస్ ఎట్రెనెస్'' అని, ''ఈవ్ లా సెయింట్ సిల్వెస్ట్రె'' అని కూడా పిలుస్తారు. మనం ''హ్యాపీ న్యూ ఇయర్'' అని గ్రీట్ చేసుకున్నట్టు ''బొన్నే అన్నీ'' అంటూ పరస్పరం అభినందనలు తెలుపుకుంటారు. ఇక ఈఫిల్ టవర్ సాక్షిగా టపాసులు మిన్నంటుతాయి. న్యూ ఇయర్ ఉత్సవంలో పాల్గొన్న అసంఖ్యాకమైన ప్రజానీకంతో అక్కడి వాతావరణం మహా ఉత్సాహంగా వుంటుంది. అసలు న్యూ ఇయర్‌కు కెళకళలాడని ప్రపంచ వీధులుంటాయా?!
స్కూలు, కాలేజి, ఆఫీసు - అన్నీ దాన్ని అనుసరించే వుంటాయి. అంతేతప్ప తెలుగు క్యాలెండర్ ప్రకారం తిథులు, వారాల ప్రకారం నడచుకుంటామంటే కుదరదు. నాలుగేళ్ళకోసారి వచ్చే లీప్ ఇయర్‌తో లెక్కలన్నీ కుదిరి ఇంగ్లీష్ క్యాలెండర్ పకడ్బందీగా వుంటుంది. ఎక్కడా అధిక మాసాలూ గట్రా వుండవు. మన పంచాంగాలను అర్థం చేసుకోడానికి పాండిత్యం వుండాలి కానీ, ఇంగ్లీష్ క్యాలెండర్‌కు అవేమీ అవసరంలేదు. మరి, ఇంత తేలిగ్గా, సుగమంగా ఏర్పాటైన పద్ధతి కనుక, ఆ క్యాలెండర్‌లో మొదటిరోజు కనుక దేశాలు, వర్గాలతో సంబంధం లేకుండా అందరూ అక్కున చేర్చుకుంటున్నారు.
ఉగాది - కొత్త సంవత్సరం
ఈ న్యూ ఇయర్‌ని ఒకసారి పక్కనపెడితే మన తెలుగువాళ్ళు ఉగాదిని కొత్త సంవత్సరంగా జరుపుకుంటాం. ఇది చైత్ర శుద్ధ పాడ్యమిరోజున వస్తుంది. మనవాళ్ళు తిథులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. చావుపుట్టుకలను కూడా తిథి, వార, నక్షత్రాలనుబట్టి గణిస్తారు. సంవత్సరాదిరోజున రాశిఫలాలు చెప్పించుకుంటారు. ముఖ్యంగా ఆ ఏడాది వర్షాలు ఎలా ఉన్నది, దేశం సుభిక్షంగా వుండబోతున్నదా లేక కరువుకాటకాలేమైనా రాబోతున్నాయి లాంటి ఫలితాలన్నీ కొందరు పండితులు పంచాంగ శ్రవణంద్వారా వినిపిస్తారు.
తిరువాల్లువార్ ఎరా
తమిళుల నూతన సంవత్సరం థాయి నెలలో మొదటిరోజు. తమిళనాడు డి.ఎం.కె. ప్రభుత్వం 2008 జనవరి 29న థాయి నెలలో మొదటిరోజు తమిళులకు కొత్త సంవత్సరం అంటూ డిక్లరేషన్ బిల్ పాస్ చేసింది. తమిళనాడు న్యూ ఇయర్ యాక్ట్ 2008ని అనుసరించి అప్పటి గవర్నర్ కొందరు తమిళ పండితులతో చర్చించిన మీదట అలా నిర్ణయించినట్లు తెలిపారు. ఆ నిర్ణయంలో ఎలాంటి అభ్యంతరాలు లేకపోయాయి. దాంతో తమిళ క్యాలెండర్ తిరువాల్లువార్ ఎరాను అధికారికంగా ప్రకటించారు.
మనకు తెలుగులో ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత- అంటూ అరవై తెలుగు సంవత్సరాలున్నట్టే తమిళిలకూ అరవై సంవత్సరాలున్నాయి. మొదట్లో తమిళులు మనం సంక్రాంతి లేదా పొంగల్ జరుపుకునే జనవరి 14వ తేదీని కొత్త సంవత్సురంగా వేడుక చేసుకునేవారు. కానీ, తర్వాత చోటుచేసుకున్న పరిణామలను అనుసరించి సంప్రదాయబద్దంగా అది సరికాదని, థాయి నెలలో మొదటిరోజును కొత్తసంవత్సరంగా జరుపుకుంటున్నారు. ఇది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ నెల మధ్యలో వస్తుంది. మన ఉగాది కూడా మార్చి చివర్లో లేదా ఏప్రిల్ మధ్యలోనే వస్తుంది. తమిళనాడు వాసులే కాకుండా, శ్రీలంక, ఇంకా ఇతర దేశాల్లో స్థిరపడిన తమిళులందరూ ఈరోజునే నూతన సంవత్సరంగా గుర్తించి వేడుక చేసుకుంటున్నారు.
శ ఈస్ట్రన్ ఆర్తడాక్స్ చర్చి సంప్రదాయం ప్రకారం జనవరి 14వ తేదీ కొత్త సంవత్సరం. దీన్ని జూలియన్ క్యాలెండర్ అంటారు. కొన్ని దేశాల్లో గ్రెగేరియన్ క్యాలెండర్ న్యూ ఇయర్‌తోబాటు జూలియన్ క్యాలెండర్ న్యూ ఇయర్‌ను కూడా వేడుక చేస్తారు. జనవరి 1వ తేదీని చాలా దేశాల్లో సెలవుదినంగా పరిగణిస్తారు. జవవరి 1 సివిక్ హాలిడే కాగా జూలియన్ న్యూ ఇయర్‌ను ''ఓల్డ్ న్యూ ఇయర్''గా పేర్కొంటూ రెలిజియస్ హాలిడేగా ప్రకటించారు. జార్జియా, జెరూసలేం, రష్యా, రిపబ్లిక్ ఆఫ్ మెకడోనియా, సెర్బియా ఇంకా ఉక్రెయిన్ తదితర సాంప్రదాయ చర్చిల్లో ఇప్పటికీ జూలియన్ క్యాలెండర్‌ను అనుసరించి కొత్త సంవత్సరాన్ని జరుపుతున్నారు.
చైనా దేశస్తుల కొత్త సంవత్సరాన్ని లూనార్ న్యూ ఇయర్ అంటారు. లూనార్ అంటే చాంద్రమానం. చైనీయులకి మొదటి చాంద్రమాన మాసంలో అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి కొత్త సంవత్సరం అన్నమాట. ఇది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం జనవరి 21 - ఫిబ్రవరి 21 తేదీల మధ్యలో వస్తుంది.
వియత్నాం కొత్త సంవత్సరం, చైనీయులు జరుపుకునే రోజునే జరుపుకుంటారు. వీళ్ళు కొత్త సంవత్సరాన్ని ''టెట్ న్గూయెన్ డాన్'' అంటారు.
టిబెట్ దేశస్తులు న్యూ ఇయర్‌ను లోసార్'' అంటారు. ఇది జనవరి, మార్చి మధ్యలో వస్తుంది.
భారత్‌లో అనేక ప్రాంతాల, వర్గాలవారు మార్చి, ఏప్రిల్ నెలల్లో వచ్చే చైత్ర శుద్ధ పాడ్యమిని కొత్త సంవత్సరంగా సెలబ్రేట్ చేసుకుంటారు.
పంజాబీలే లేదా సిక్కులు తమ నానక్ షాహీ క్యాలెండర్‌ను అనుసరించి ఏప్రిల్ 14వ తేదీని కొత్త సంవత్సరంగా జరుపుకుంటారు.
ఇరాన్ దేశస్తులు కొత్త సంవత్సరాన్ని ''నా-రజ్'' అంటారు. ఇది మార్చి 20 లేదా 21వ తేదీన వస్మ్‌తుంది. ఈ ఇరానియన్ క్యాలెండర్ ఆసియా మధ్య ప్రాంతాలకు కూడా పాకింది. అదితే ఈ దేశాలవాళ్ళు మార్చి 22వ తేదీని నా-రజ్‌గా జరుపుకుంటారు.
కాశ్మీరీ క్యాలెండర్‌ను అనుసరించి నవ్‌రేహ్‌ను కొత్త సంవత్సరంగా జరుపుకుంటారు. ఇది మార్చి నెలలో వస్తుంది.
మహారాష్ట్ర ప్రాంతీయులు హిందూ క్యాలెండర్ ప్రకారం ''గుడి పాడ్వా''ను నూతన సంవత్సరంగా వేడుక చేస్తారు. ఇది మార్చి, ఏప్రిల్ నెలల్లో వస్తుంది.
కన్నడీగులు కూడా హిందూ క్యాలెండర్‌ను అనుసరించే కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు.
సింధీవారు కొత్త సంవత్సరాన్ని ''చేటీ చాంద్'' అంటారు. ఇది సరిగ్గా మన సంవత్సరాది లేదా మహరాష్ట్రీయుల గుడిపాడ్వాయే.
నేపాలీలు బైశాఖ (వైశాఖ) మాస తొలిరోజును కొత్త సంవత్సరంగా వేడుక చేస్తారు. ఇది ఏప్రిల్ 12, 15 తేదీల్లో వస్తుంది.
అస్సామీలు న్యూ ఇయర్‌ను రంగోలీ బిహు అంటారు. ఇది ఏప్రిల్ 14 లేదా 15వ తేదీన వస్తుంది.
బెంగాలీలు నూతన సంవత్సరాన్ని ''పోహెలా బైశాఖ్'' లేదా బాంగ్ళా ''నొబొబొర్షొ'' అంటారు. ఇది ఏప్రిల్ 14 లేదా 15వ తేదీన వస్తుంది. పశ్చిమ బెంగాల్లోనూ, బంగ్ళాదేశ్‌లోనూ ఈ వేడుక జరుపుతారు.
ఒరియావారు న్యూ ఇయర్‌ను విశువ సంక్రాంతి అంటారు. ఇది ఏప్రిల్ 14వ తేదీన వస్తుంది.
దేశ, విదేశాల్లో ఎన్నెన్ని రోజుల్లో కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటున్నారు కదూ?! తమ తమ ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సాంప్రదాయాలను బట్టి ఎవరెలా జరుపుకున్నా మొత్తానికి మాటలకందని ఆనందమే పర్యవసానం. కొత్త బట్టలు, రకరకాల పిండివంటలు, బంధుమిత్రులతో కాలక్షేపాలతో ఆరోజు ఎలా గడుస్తుందో తెలీదు. ముఖ్యంగా న్యూ ఇయర్‌కు వేలాది రకాలు గ్రీటింగ్ కార్డులు అచ్చవుతుంటాయి. మనసుకు నచ్చిన ఆత్మీయులకు చక్కటి కార్డును ఎంపిక చేయడం కూడా ఓ గొప్ప కళే. దాన్ని చూసినవారు పరవశంతో తబ్బిబ్బయిపోతారు. తమ మనసులో ఉన్న ప్రేమను పోయెటిగ్గా చెప్పడమే కాకుండా ఏడాది పొడుగునా సుఖంగా, సంతోషంగా వుండమని చాటిచెప్పే గ్రీటింగ్ కార్డులు ఇప్పుడు వందల ఖరీదుతో అందుకోండి చూద్దామంటున్నాయి.
నచ్చినవారికి గ్రీటింగ్ కార్డును సెలక్ట్ చేసేంత ఓపిక లేనివారు ఫ్లవర్ బొకేను ఇవ్వడం మరో సంప్రదాయం. పిండి కొద్దీ రొట్టె అన్నట్టు ధర పెట్టిన కొద్దీ బ్రహ్మాండమైన పూలగుచ్ఛాలు మార్కెట్లో దొరుకుతాయి. దుస్తులో, వస్తువులో అయితే అవతలివారికి నచ్చకపోయే ప్రమాదం వుంది. కానీ, పుష్పగుచ్ఛాలను ఇష్టపడనివారుంటారా? నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి గ్రీటింగ్ కార్డులు లేదా ఫ్లవర్ బొకేలను మించినవి లేవు.
అదీ సంగతి! న్యూ ఇయర్‌ను ఎవరెలా జరుపుకుంటేనేం, ఎవరు ఎవరికి ఎలా అభినందనలు తెలియజేస్తేనేం, మొత్తానికి ఈ సంవత్సురం దిగ్విజయంగా సాగాలని, వచ్చే ఏడాదికి మరింత అభివృద్ధిని మన ఖాతాలో జమచేసుకుని, విజయకేతనం ఎగురవేయాలని కోరుకుంటూ... విష్యూ హ్యాపీ న్యూ ఇయర్!!!