ఊహాలోకంలో విహరించే ప్రేమికులకి.... మనసు ప్రశాంతతని కోరుకునే వారికీ..
పనులతో అలసి సొలసి సాయంత్రం వ్యాహ్యాళిని కోరుకునే ఉద్యోగులకి.. విద్యార్థులకి...
ఆహ్లాదభరిత వాతావరణాన్ని అందిస్తోంది హుసేన్‌సాగర్..
బోటుషికార్లు.. చిరుతిళ్లు.. లేజర్ షోలు.. ఇలా ప్రతిఒక్కటీ వయోబేధంని పక్కకు నెట్టి...
తమ మధుర స్మృతులలో భాగమై పోయేలా చూస్తోందనటంలో సందేహం లేదెవ్వరికీ.
సాంస్కృతిక వారసత్వానికి, పరమత సహనానికి ప్రతీక గా నిలిచే మన భాగ్యనగరంలో చారిత్రక కట్టడాలకు, దేవా లయా లకు, మసీదులకు, హస్తకళలకి, నృత్యానికి ప్రత్యేక స్థానం ఉంది.భారతావనిలోని ప్రధాన నగరాలకు ధీటుగా ఎదుగుతూ అభివృద్ధి చెందిన నగరాల సరసన స్థానం దక్కించు కుని ప్రపంచ మహానగరాలతో పోటీ పడుతూ 41వ స్థానాన్ని దక్కించుకుంది.జంటనగరాలుగా పేరు తెచ్చుకున్న హైదరాబాద్- సికింద్రాబాద్‌లని వేరు చేస్తూ వాటి మధ్య సారధిగా నిలుస్తోంది హుసేన్ సాగర్ అనటం సమంజసం కూడా. చార్మినార్ కన్నా పురాతన చరిత్ర కలిగిన హుసేన్ సాగర్ జన దాహార్తి తీర్చేది ఒకప్పుడు.
చరిత్ర భారతావనిని శాతవాహనులు, చాణుక్యులు, కాకతీయు లు, బహుమనీ సుల్తానులు పరిపాలించాక... గోల్కొండని రాజధానిగా చేసుకుని పాలించిన కులీ కుతుబ్‌షా 1591 లో తనప్రియురాలు భాగమతి స్మృతి చిహ్నంగా నిర్మించిన మహానగరమే భాగ్యనగరం. అంతకు ముందే... తన సామ్రాజ్యంలోని ప్రజలకు తాగు నీరు అందించేందుకు. ఇబ్రహీం మూసీ ఉపనదిపై అడ్డుకట్ట వేస్తూ దీని నిర్మాణం చేపట్టి, తన అల్లుడై న 'హుసేన్ షా'కు నిర్మాణపనుల పర్యవేక్షణ అప్ప గించారు.రాజప్రసాదంలో భోగభాగ్యాలను భవించే హుసేన్‌కు ఈ కొలను నిర్మాణ సమయంలో ప్రజల కష్టాలు, బాధలు స్వయంగా చూసి చలించి పో యారు. అన్నింటినీ వీడి సర్వ సంగపరిత్యాగిగా మారి 'సుఫీ'గా
నిత్యం తపస్సు చేస్తూ 'వలీ'గా మారిపోయారు. తన యోగ ముద్రతో ఎన్నో అద్భుత శక్తులు అందుకున్న 'హుస్సేన్' 1562లో జనదాహార్తిని తీర్చే కొలను నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి రోగాలు రాకుండా ఉండేలా తన దివ్య శక్తులని నిక్షిప్తం చేసినట్లు ఓ కథనం ప్రచారం లో ఉంది. ప్రజలను, తమని రోగాల బారి నుండి రక్షించ డంతో అప్పటి నుండే దీనిని కుతుబ్‌షా దీనికి హుసేన్ పేరు పెట్టాడని... 'హుసేన్‌సాగర్'గా పిలవటం ప్రారంభిం చినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.
ఆపై 1687లో మొఘల్ చక్రవర్తుల్లో ఒకడైన ఔరంగ జేబు ఆ ప్రాంతాన్ని జయించి పాలించగా.... 1724 నుండి అసఫ్ జహీ ప్రభువులు దక్కన్ ప్రాంతాన్ని పాలించారు.. పరాక్రమశాలిగా పేరున్న మీర్ ఖమద్రీన్ ఆలీఖాన్ ఈ రాజ్యవంశ వ్యవస్ధాపకుడు. 1748 వరకు పాలించిన ఈత ని ధైర్యసాహసాలకు మెచ్చి మొఘలాయి ప్రభువులు 'నిజాం' అనే గౌరవ పురస్కారాన్ని అందించడంతో అప్పటి నుండి వారిని నిజాం ప్రభువుగా పిలవటం ప్రారంభమై నట్లు చరిత్రకారులు చెప్తారు. 1762లో ఆలీఖాన్ రెండో నిజాం ప్రభువుగా దక్కన్ ప్రాంతాన్ని 1803 వరకు పాలిం చాడు. శత్రు సైన్యాలను ఎదుర్కొనేందుకు బ్రిటీష్ పాల కులను సైన్య సహకారం తీసుకోవాలని నిర్ణయించి 1798 లో బ్రిటీష్ వారితో ఒప్పందాన్ని చేసుకున్నారు. ఈ ఒప్పం దం ప్రకారం.. నిజాంపై దండయాత్ర చేసేవారిని ఎదుర్కొ నే బ్రిటన్ సైన్యానికి కావాల్సిన వసతులు, ఇతర ఖర్చులు అన్నీ నిజాం భరించాలి. ఈ క్రమంలో వారికోసం హుసేన్ సాగర్ ఆవల ప్రాంతంలో 6 కిలోమీటర్ల దూరంలో ప్రత్యేక సైనిక స్ధావరాలను కంటోన్మెంట్ ప్రాంతంలో నిర్మించి 5000 మంది సైనికులకు వసతి కల్పించి... వరా రాక పోకల కోసం హుసేన్‌సాగర్ కట్టనిర్మాణాన్ని విస్తరించారు. రాను రానూ సైనికుల సంఖ్య పెరగటంతో సైనిక స్ధావరా లను బొల్లారం, తిరుమల గిరి, బొయిన్ పల్లి వైపులకు విస్తరించగా.. ఆలీఖాన్ మరణానంతరం పాలనా పగ్గాలు చేపట్టిన సికిందర్ జా మూడో నిజాంగా తన పేరు ప్రఖ్యా తులు నిలుపుకునే క్రమంలో అప్పటికే బ్రిటీష్ సైనికులు నివాసముంటున్న ప్రాంతాలతో పాటు మరిన్ని గ్రామా లను కలిపి తన పేరుపై సికిందరాబాద్ నిర్మాణానికి శ్రీ కారం చుట్టి పూర్తి చేయగా..బ్రిటీష్ సైనికాధికారి కెప్టెన్ సీడెన్ హామ్ నిజాం సంస్ధానానికి జంట నగరంగా సికింద్రాబాద్‌ని చేయాలని చేసిన ప్రతిపాదన నచ్చిన సికిందర్ అందుకు అనుగుణం గా 1808 జూన్3న అధికారికంగా 'ఫర్మానా' జారీ చేసిన నాటి నుండి హైదరాబాద్‌కు సికింద్రాబాద్ జంటనగరం కాగా 1948 వరకు ఈ ప్రాంత మంతా నిజాం నవాబుల పాలనలో ఉంది.
వీరి కాలంలో జనాభా అవసరాలకు, పాలనకు అనుగుణంగా..ఎన్నో కట్టడాలు, చెరువులు నిర్మించ బడి విస్తరించగా... ఆరవ నిజాం ప్రభువు మహబూ బ్ అలీషా తన నివాసం కోసం హుసేన్ సాగర్ ప్రక్కనే భవంతి నిర్మాణం చేయించుకున్నా.. కొన్ని దృష్టాంతాలు తనకి అపశకునంగా తోచడంతో 'గృహ ప్రవేశం' జరపలేదు. ఖాళీగా ఉన్న ఈ భవనా న్ని పాషా కుమారుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన పాలనా భవనంగా మార్చుకున్నారు. ఇదీ నేడు సెక్ర టేరియట్ (సచివాలయం)గా పనిచేస్తోంది.
హైదరాబాద్-సికింద్రాబాద్‌లను కలుపుతూ 1568లో నిర్మించిన గట్టు నిర్మాణం రోజురోజుకీ కుచించుకుపోతూ చిన్నపాటి వర్షం వస్తే.. హుసేన్‌సాగర్ పరిసరాలు జల మయం కావటాన్ని గమనించి ఒకప్పుడు కంటోన్మెంట్ సైనిక అవసరాల కోసం వాడిన రహదారిని మహానగరం గా విస్తరిస్తున్న క్రమంలో టాంకబేండ్ ప్రాధాన్యతని గుర్తిం చి విస్తారించి..రవాణాసౌకర్యాన్ని మెరుగుపరిచారు. హుసే న్‌సాగర్‌ని ముస్లింలు ఎంత పవిత్రతతో చూసుకుం టారో దీని గట్టుపై మైసమ్మ ఆలయం ఉండటంతో హిందువులకు ఇది పుణ్యతీర్థమైంది.
గణేష్ నిమజ్జనోత్సవం
దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ గణేష్ ఉత్సవాలకు పేరుంది. 'వినాయకచతుర్థి' వస్తోందంటే నెల రోజుల ముందు నుండి ఇక్కడ పండగ వాతావరణం నెల కొంటుంది. 1979లో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నా రెడ్డి హుసేన్‌సాగర్‌లో గణేష్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వటంతో 'హైదరాబాద్'కు మరింత ప్రముఖమైంది.
తధాగతుడు....
హుసేన్‌సాగర్ ప్రాంతాన్ని అద్భుత పర్యాటక కేంద్రంగా మార్చాలన్న తలంపుతో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి సుందర వనంలా తీర్చిదిద్దారు. ప్రత్యేక శ్రద్ధతో ఎప్పటికప్పుడు నిర్మాణ పనులని పర్యవేక్షించిన ఆయన హుసేన్ సాగర్ మధ్యలో తధాగతుని విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తల చిందే తడవుగా ఏకశిలతో విగ్ర హాన్ని తయారు చేయించి, ప్రత్యే క వాహనంలో తరలించే ప్రయత్నంలో ఐదుగురు మృత్యువాత పడటం, బుద్ధ విగ్రహం హుసేన్ సాగర్ లోమునిగిపోవటం అనే క విమర్శలకు తావిచ్చి నా, చివరకు 1992లో విగ్రహాన్ని ప్రతిష్ఠించి తన పట్టుదల నిలుపుకున్నారు.
'జిబ్రాల్టర్ రాక'తో ఏకశిలగా 17.5 అడుగుల ఎత్తు 350 టన్నుల బరువుతో తయారుచేయించారు. నగరానికి 60 కి.మీ. దూరంలో గణపతి స్థపతి నేతృత్వంలో 40 మంది శిల్పులు రేయింబవళ్లు శ్రమిం చి తయారుచేయగా 192 చక్రాల వాహనంపై తీసుకు వచ్చారు. నేడు హైదరా బాద్ అనగానే చార్మినార్ తో బాటు బుద్ధవిగ్ర హం కూడా ఓ ట్రేడ్ మార్క్ కావటం విశేషం.
అలాగే టాంక బండ్‌పై తెలుగు జాతి వైభవానికి కృషి చేస ిన 33మంది మహనీయుల విగ్రహాలను నెలకొల్పి.. అంద మైన గార్డెన్లు రూపొందించారు. ఇటీవల కొంతకాలంగా రాష్ట్రంలో జరుగుతున్న ప్రాంతీయ విబేధాల ప్రభావం ఈ మహనీయులపైనా పడి.విధ్వంసకారుల చేతిలో బలయ్యి, ఈ ప్రాంతమంతా అతలాకుతలమై.. చాలా వరకు విగ్రహా లు ధ్వంసమై హృదయవిదార కరంగా మారిపోయాయి. అయినా వీటిని చూసేందుకు కూడా జనం తరలివస్తూ గత వైభవాన్ని గుర్తు చేసుకుంటూ ఉండటం విశేషం.
వివిధ పార్కులు, మందిరాలు, భవనాలు, ప్రభుత్వ కార్యా లయాలు దీని సమీపంలో ఉండటంతో ఈ ప్రాంత మంతా... నిత్యం కళకళ లాడుతూనే ఉంటుంది.
కాలుష్యం కోరల్లో
ఒకప్పుడు హైదరాబాద్ మహానగరానికే మంచి నీటిని అందించిన 'హుసేన్‌సాగర్' నేడు మురుగు కంపు కొడుతోంది. 24 కి.మీ. విస్తీర్ణం లో దీన్ని పార్కుల పేరుతో నగరంలోని శకలాలను దీనిలో వేస్తూ.. దీని వైశాల్యం 13 చదరపు కి.మీ. తగ్గి పోయింది. దీనికితోడు గణేష్ నిమజ్జనం కారణం గా రసాయనాలు, పరిసరాల్లో వెలసిన అనేక ఆసు పత్రుల నుండి వెలువడుతున్న వ్యర్థాలు ఇందులో నే కలుపుతుండడంతో పూర్తిగా విషతుల్యంగా మారిపోతున్నట్లు పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ పార్క్ పేరుతో రాష్ట్ర కాలు ష్య నియంత్రణ బోర్డ్ కొంత కట్టడి చేసినా అది కార్యరూపం దాల్చలేదు.
ఈ క్రమంలో సాగర్ జలాల ప్రక్షాళన కోసం హెచ్‌సిఐపి (హుసేన్‌సాగర్ అభివృద్ధి ప్రాజెక్ట) నడుం బిగించింది. 2013 నాటికి కాలుష్య రహిత సరస్సుగా మార్చేసేందుకు ప్రయత్నాలు చేస్తామని చెప్తోంది. 370 కోట్ల వ్యయంతో 2008లో ప్రారంభించి పనులు పూర్తయ్యి హుసేన్‌సాగర్‌కి పూర్వవైభవం ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.
నెక్లెస్ రోడ్
ఉహాలోకంలో విహరించే పనులతో అలసి సొలసి సాయం త్రం వ్యాహ్యాళిని కోరుకునే ఉద్యోగులకి.. విద్యార్థులకి... ఆహ్లాదభరిత వాతావరణాన్ని అందిస్తోంది.
టాంకబేండ్ పరిసరాలలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని జరిపిన నిర్మాణం ఇది. ఇక్కడ దొరికే చిరుతిళ్ల కి అంతా ప్రాధాన్యత ఇవ్వటం విశేషం. కొన్ని కొన్ని ఇబ్బం దులున్నా కాని ఇక్కడి ఆహ్లాదకర వాతావరణం సంభ్రమా శ్చర్యాలకు గురిచేస్తుంది. మొక్కజొన్న పొత్తులు, ఐస్‌క్రీము లు, శీతల పానీయాలు, పొగలు కక్కే కాఫీ, ఇరానీ చారు లు ఎంతో రిలాక్స కలిగిస్తాయి. అదీ అందుబాటు ధరల్లో
్ల సరదాగా నెక్లెస్‌రోడ్‌పై ఫ్రెండ్స్‌తో హాయిగా కబుర్లు చెప్పుకుంటూ నడుచుకుంటూ వెళితే ఆ అనుభూతి వేరని అంటారు మరికొందరు. అందుకే అన్ని వర్గాలు నెక్లెస్‌రోడ్‌లో షికారుకి రావటానికి ఇష్టపడతారు.
పైగా ఇక్కడి జలవిహార్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగే ఎంటర్‌టైన్‌మెంట్ సందర్శకులను కట్టి పడేసేలా ఉంటాయి.
లుంబినీ పార్క్, ఎన్టీఆర్ గార్డెన్స్ పెళ్లయిన జంటలకివి ప్రత్యేకంగా చెప్పాలి. లుంబినీ పార్కులో బోటు షికార్లు 'లాహిరి.. లాహిరి'ని గుర్తు చేసే లా సాగుతుందనటంలో సందేహం లేదు. లేజర్ షోలు ఎంత ఆకట్టు కుంటాయో, చిలక జ్యోతిష్యాలతో సరదాగా అంతే ఆకట్టు కుంటాయి.
ఇక ఎన్టీఆర్ గార్డెన్‌లో చిన్నారులు ఆడు కునేందుకు వాటర్ డ్రైవ్‌లు, త్రెడ్ జంప్‌లతో పాటు అనేక ఆటలున్నాయి. ...
ఇవికాకటాంకబేండ్ బయ ట ప్రక్కనున్న ప్రాంతంలో నెక్లెస్‌రోడ్, ఐమాక్స, సంజీవయ్యపార్క్, హజరత్ సైదానీ సమాధి, ఇందిరాపార్క్, కట్టమైసమ్మ గుడి, సచివాలయం, బోట్స్‌క్లబ్, ఐస్‌వర్డ్ తదితరాలు కట్టిపడేస్తాయి.
హుసేన్‌సాగర్ బై లైనింగ్
పర్యాటక కేంద్రాలలో ప్రముఖంగా నిలుస్తున్న హుసేన్ సాగర్ పరిసరాలు ప్రముఖంగా నిలుస్తున్నా హుసేన్‌సాగర్ పరిసరాలు చూపించేందుకు ఎపి టూరిజం, హైద్రాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అదాలత్‌లు ప్రత్యేక ప్యాకేజీలు ప్రారంభించాయి.ఎపి టూరిజం సికింద్రాబాద్ నుండి టూరిస్టులని ప్రత్యేక వాహనంలో తీసుకెళ్లి.. హుసేన ్‌సాగర్‌లో పడవ ప్రయాణంతోపాటు లుంబినీ పార్క్, ఎన్టీఆర్ పార్క్, బిర్లా టెంపుల్, లేజర్‌షోలు చూపిస్తాయి. మధ్యలో అల్పాహారం కూడా అందజేస్తాయి.
నిత్యం బిజీ బిజీగా ఉండే నగరంలో ఓ సారైన హుసేన ్‌సాగర్‌కు వెళ్లి మనసార ఆనందాన్ని ఆశ్వాదించి తిరిగి నూతనోత్సాహాన్ని పొందాలనుకుంటారన్నది వాస్తవం. హుసేన్‌సాగర్.. బోటుషికార్లు.. చిరుతిళ్లు.. లేజర్ షోలు ..ఇలా ప్రతి ఒక్కటీ వయోబేధంని పక్కకు నెట్టి... తమ మధుర స్మృతులలో భాగమై పోయేలా చూస్తోందనటం లో సందేహం లేదెవ్వరికీ.