వ్యవసాయరంగం పూర్తిగా దుర్భిక్ష పరిస్థితులనుఎదుర్కొంటోంది. గత మూడే ళ్ళుగా అన్నదాతను వెంటాడుతున్న కరవు ఈసారి మరింత ప్రభావాన్ని చూపుతోంది. అనాదిగా నమ్ముకున్న వృత్తి కడుపు నింపలేక, బతుకుదెరువుకు మరో మార్గం లేక రాష్ట్రంలో రైత న్నలు తల్లడిల్లుతున్నారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలేవీ వారికి ఆశించిన ప్రయోజనాన్ని చేకూర్చడం లేదు. పెట్టుబడి వ్యయం పెరిగి, పంటలకు గిట్టు బాటు ధరలు రాక, తెచ్చిన అప్పులు తీరక కష్టనష్టాల మధ్య సాగుతున్న వ్యవాయం కర్షకుల కళ్ళల్లో నీళ్ళు తెప్పిస్తోంది. అతివృష్టి, అనావృష్టి, వరదలు, కరెంటు కోత , నకిలీ విత్తనా లు, అందని ఎరు వులు, స్పందించని బ్యాంకర్లు... ఇవన్నీ వారి పాలిట శాపంగా మారుతున్నాయి. ప్రతియేటా నిత్యావసర సరుకుల ధరలు అదుపు తప్పి పెరుగుతున్నా, రైతు పండిం చిన పంటకు తగిన నిష్పత్తిలో మద్దతుధరలు అందడం లేదు. ఏడాది పొడవునా చెమటోడ్చి పండించిన పంటను కొనుగోలు చేయడానికి వ్యాపారులు ముందుకు రావడం లేదు. గత్యంత రంలేక కొన్ని ప్రాంతాల్లో పంటల విరామం, మరికొన్ని ప్రాం తాల్లో వలసలు తప్పని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ ఒడిదుడుకులను, ఆటుపోట్ల ను తట్టుకొనే శక్తి లేని రైతన్నలు కుటుంబ పోషణ భారమై ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. ఈ విధమైన ప్రతికూల పరిస్థితుల మధ్య గత ఏడాదికాలంగా అన్నదాతలు ముళ్ళబాటలోనే బతుకులు వెల్లదీస్తున్నారు.
2011 ఖరీఫ్ మొదలుకొని వ్యవసాయ రంగానికి అన్నీ ప్రతికూల పరిస్థితులే ఎదురవుతున్నాయి. సీజన్ ప్రారంభంలో తలెత్తిన వర్షాభావంరైతులను ఆందోళనకు గురిచేయగా, అనం తరం కురిసిన అతివృష్టి వల్ల తీవ్ర బీభత్సం జరిగింది. అనేక ప్రాంతాల్లో అడపాదడపా సాగైన పంటలు కూడా నాశనమై పోయాయి. అనంతరం ఖరీఫ్ ఆఖరులో మళ్ళీ భారీ వర్షాలు రాష్ట్రాన్ని ముంచెత్తాయి. ప్రాథమిక అంచనాల మేరకు సుమా రు 33 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగింది. వరి, పత్తి, వేరు శనగ, పొద్దుతిరుగుడు, ఆముదం, కంది, మొక్కజొన్న పంట లు పెద్దఎత్తున దెబ్బతిన్నాయి. కొన్ని జిల్లాల్లో తీవ్రమైన ఎరు వుల కొరత, నకలీ విత్తనాలు అన్నదాతను నట్టేట ముంచాయి. అదే నెలలో వరుసగా ఆరు తుఫానులు సంభవించి పంట నష్టంతో పాటు తీవ్రస్థాయిలో ఆస్తినష్టం, ప్రాణ, పశునష్టం కూడా సంభ వించింది. అదే సమయంలో తారాస్థాయికి చేరిన ప్రాంతీయ వాద ఉద్యమాలు తీవ్ర ప్రభావం చూపాయి. సమ స్యల సుడి గుండం మధ్య మెట్ట పంటల విస్తీర్ణం 25 శాతానికి పైగా తగ్గి పోయింది. ఆ విపత్తు నుంచి తేరుకోకముందే రబీ సీజన్ ప్రారంభమైంది. తీవ్రమైన వర్షాభావం రైతాంగాన్ని మరింత ఆందోళనకు గురిచేసింది. పండించిన ప్రతి ధాన్యం గింజను కొను గోలు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం చేతులె త్తేసింది. మిల్లర్లను, వ్యాపారులను అప్రమత్తం చేసి ఇందిరా క్రాంతి పథం బృందాలనురంగంలోకి దింపినప్పటికీ పరిస్థితు లు అదుపులోకి రాలేదు. కనీస మద్దతు ధర ధాన్యం క్వింటాలు ఒక్కింటికీ 1030 రూపాయలు ఉండగా, రూ.900కు మించి కొనుగోలు చేయలేదు. దీంతో పెట్టుబడి సైతం చేతికందని రైతులు తీవ్రంగా నష్టపోవలసి వచ్చింది. సకల జనుల సమ్మె సందర్భంలో తీవ్ర కరెంటు కోత, అందని సహకారం, ఎరువు లు, విత్తనాల కొరత తదితర కారణాల వల్ల 40 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ పంటలు ఎండిపోయాయి. నష్టాలను భరించలేని ఈ పరిస్థితుల్లో కోనసీమలో పంటల విరామం ఉద్యమం ప్రారం భమైంది. కేవలం 15 రోజుల్లోనే తెలంగాణ జిల్లా లకు సైతం పాకిన ఈ ఉద్యమం ప్రభు త్వానికి సవాల్‌గా మారింది. లక్షల ఎకరాల పంటపొలాలు బీళ్ళుగా మారాయి. గిట్టుబాటు లేని వ్యవసాయాన్ని తామిక చేయలేమని రైతులు ప్రభుత్వంపై తిరు గుబాటు ప్రారంభించారు. ప్రతిపక్ష పార్టీలు వారికి అండగా ఉన్న పరిస్థితుల్లో క్రాప్ హాలిడేకు దారి తీసిన కారణాలను, పరిస్థితులను అధ్యయనం చేయడానికి ప్రభుత్వం మాజీ ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి మోహన్‌కందా నేతృత్వంలో ఒక కమిటీ ని నియమించింది. సుమారు నెలరోజుల తర్వాత గిట్టు బాటు లేకే రైతులు పంటల విరామాన్ని ప్రకటించినట్లు మోహన్‌కందా కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ధాన్యం కొనుగోలు బాధితులను రైతుమిత్ర బృందాలకు, స్వయం సహాయక సంఘా లకు అప్పగించిన ప్రభుత్వం వారికి అవస రమైన ఆర్ధిక సహాయం అందచేయాలని, ఉత్పత్తుల అంచ నాకు అనుగుణంగా ధాన్యాన్ని నిల్వ ఉంచేందుకు గోదాములు అవస రమని కందా తేల్చిచెప్పారు. స్వామినాథన్ కమిషన్ నివేదిక ప్రకారం రైతు పెట్టుబడి వ్యయానికి 50 శాతం కలిపి కనీస మద్ద తు ధరలు అమలు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. అయినా ప్రభుత్వం చేపట్టిన తదనంతర చర్యలు నామమాత్రం గానే కొనసాగా యి. ప్రకృతి కనికరించకపోయినా, ప్రభుత్వ సహకారం అంద కపోయినా పోగొట్టుకున్న చోటే వెదుక్కుందామన్న ఆలోచనతో పంటలను సాగు చేస్తున్నా రు. రబీ సాధారణ విస్తీర్ణం 40.44 లక్షల హెక్టార్లు కాగా అరకొర సౌకర్యాలతోనే 20 లక్షల హెక్టార్లు సాగు చేశారు. వర్షా భావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పత్తి పంట సాగుపై ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు.
ఆదుకోవడానికి నిబంధనలు ఎన్నెన్నో!
రాష్ట్రాన్ని పీడిస్తున్న వరుస కరవు పేద రైతు కుటుంబా లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఏటేటా పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోతున్న వ్యవసాయ రంగాన్ని ఆదుకునే ప్రయత్నాలే వీ కనిపించడం లేదు. మద్దతు ధరలు లేక, పంటలు గిట్టు బాటు కాక, పెట్టుబడులకు తెచ్చిన అప్పులు తీరక, బతుకు దెరువుకు మరోమార్గం లేక తీవ్రమైన సమస్యలతో విలవిలలా డుతున్న అన్నదాతలపై పాలకపక్షాలు మొసలి కన్నీరు కారుస్తున్నాయి. బాధ్యతగల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతు లత్త్తేస్తున్నాయి. ముఖ్యమంత్రులు మారినా, ప్రతిపక్షాలు ఉద్య మించినా, అధ్యయన కమిటీలు ఆదుకోవాలని సిఫార సు చేసినా చలనం మాత్రం కనిపించడంలేదు. రైతు సంక్షేమంపై పేరుతో రాష్ట్రంలో అనేక పథకాలు అమలవుతున్నప్పటికీ అవేవీ బడుగు రైతు జీవితాలను బాగు పరచలేకపోతున్నాయి. క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అధికారుల్లో నిర్లక్ష్యం, అవి నీతి అక్రమాలు వారి పాలిట శాపంగా మారుతున్నాయి.
రైతులు సాగుచేసిన పంటలు 50 శాతానికి మించి నష్ట పోతేనే పరిహారం చెల్లించాలన్న ధోరణితో ప్రభుత్వం నిబం ధనలు రూపొందిస్తోంది. దీంతో అర్హులైన రైతుల్లో సగం మం దికి కూడా నష్టపరిహారం అందుతుందన్న నమ్మకం కలగడం లదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త భాగస్వామ్యంతో ప్రతి హెక్టారు పరిమాణంగా ఈ పరిహారాన్ని అందజేయాలని భావిస్తున్నాయి. వరి, వేరుశనగ, పత్తి, చెరకు, మిరప, ఉల్లి, కూరగాయలు, పూలతోటలు, బొప్పాయి తదితర పంటలకు ప్రతి హెక్టారుకు రూ.6వేలు నష్టపరిహారంగా అందజేయాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రణాళిక తయారు చేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.2వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.4వేలు భరించనుంది. అదే విధంగా జొన్న, సజ్జలు, రాగు లు, ఆముదం, కలబంద పంటలకు ప్రతి హెక్టారుకు రూ.3 వేలు ఇవ్వాలని నిర్ణయించగా, వర్షాభావ ప్రాంతాలకు రూ.2 వేలు మాత్రమే ఇవ్వనున్నారు. పప్పుధాన్యాలు, పొద్దుతిరుగు డు, సోయాబిన్, గోధుమ, ఆజ్వాన్, అవిసె పంటలకు రూ, 3,750 చెల్లించాలని నిర్దేశించగా, వర్షాభావ ప్రాంతాలకు రూ.2 వేలు మించి ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. మొక్క జొన్నకు హెక్టారు ఒక్కింటికి రూ.5వేలు, ఉద్యానవన పంటలు, నర్సరీలకు రూ.4,500, మామిడి, నిమ్మ, జీడి మామిడి, సపోటా, జామ, దానిమ్మ, రేగు తోటలకు రూ.9 వేలు చెల్లించ నున్నారు. సాగునీటి ప్రాంతాల్లో అరటి తోటలకు రూ.24వేలు, వర్షాభావ ప్రాంతాల్లో రూ.6వేలు, పొగాకు తోటల కు రూ.6వేల చొప్పున పరిహారం చెల్లించాలని విపత్తుల నిర్వహణ శాఖ నిర్ణయించింది. అయితే రాష్ట్రంలో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్న రైతాంగాన్ని ఆదుకు నేందుకు ప్రతి హెక్టారుకు రూ.10వేలకు తగ్గకుండా పరిహారం చెల్లిం చాలని ప్రతిపక్షాలు చేస్తున్న నేపథ్యంలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో ఇంత తక్కువ మొత్తంలో నష్ట పరిహారం చెల్లింపునకు ప్రణాళికలు రూపొందించుకోవడం గమనార్హం. 2009 వరద బీభత్సాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీ య విపత్తుగా గుర్తించినా, అనంతరం 2010లో పెద్దఎత్తున సంభవించిన కరవుపై పలుసార్లు కేంద్ర బృందాలు పర్యటించి అధ్యయనం చేసినా బాధితులను ఆదుకోవడంలో జరుగుతున్న జాప్యంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడా ది కూడా అంతకు రెట్టింపు స్థాయిలో దారిద్య్రం గ్రామీణ ప్రజలను వెంటాడుతోంది. 84 శాతం ప్రాంతాల్లో సాధారణ వర్షాపాతం నమోదుకాని కారణంగానే కరవు ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ గుర్తించినప్పటికీ ప్రభుత్వ చర్యలు హామీలకే పరిమితమవుతున్నాయి. గత ఏడాది ఖరీఫ్, రబీ సీజ న్‌లలో పంటలు ఎండిపోయినందున రాష్ట్ర వ్యాప్తంగా సుమా రు 800 మండలాలను ప్రభుత్వం కరవు పీడిత ప్రాంతంగా ప్రకటించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 876 మండ లాల్లో తీవ్రమైన కరవు ఉన్నట్లు గుర్తించారు. 12 జిల్లాలు పూర్తి గా దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు ఉన్నతాధికారులు ధృవీకరించారు. ఇదంతా కాదని కేంద్ర ప్రభుత్వం కరవు ప్రాం తాల స్థితిగతులపై అధ్యయనం చేసేం దుకు అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) సంస్థకు బాధ్యతలు అప్పగించింది. కోనసీమ మొదలుకొని తెలంగాణ జిల్లాలకు సైతం పాకిన పంటల విరామంపై ప్రభుత్వం నియ మించిన మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ కందా కమిటీ పూర్తిస్థాయి నివేదిక సమర్పించినప్పటికీ, ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన రైతు సంఘాల సమావేశంలో స్పష్టమైన హామీ ఇచ్చినప్పటికీ బాధితులకు ఒక్కపైసా పరిహారం అందిన దాఖలాలు లేవు. అనంతరం తలెత్తిన కరవుపై ప్రతి జిల్లాకు ప్రత్యేకాధికారిని నియమించి పరిస్థితులపై నివేదికలు తెప్పిం చినప్పటికీ ఇంకా చర్యలు ప్రారంభం కాలేదు. మూడేళ్ళ వరు స కరవు కళ్ళ ముందు కనిపిస్తున్నప్పటికీ 2011 నైరుతి రుతు పవనాల సమయంలో క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షిం చేందుకు ప్రత్యేకా ధికారులుగా నియమించబడిన సీనియర్ ఐఎఎస్ అధికారులు ఆయా జిల్లాల్లో పర్యటించాలని ప్రభు త్వం ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. రాష్ట్రంలో సాధారణంగా చెరకు పంట విస్తీర్ణం 5 లక్షల 27 వేల ఎకరాలు సాగుకావాల్సివుండగా, ఈ వ్యవసాయ సంవత్సరం ముగిసిన ఖరీఫ్‌లో ఈ పంట 4 లక్షల 97 వేల ఎకరాలకు తగ్గింది. అదే విధం గా 2010 ఖరీఫ్‌లో 4 లక్షల 80 వేల ఎకరాలు, 2009 ఖరీఫ్‌లో 3 లక్షల 95 వేల ఎకరాల్లో మాత్రమే చెరకు సాగైనట్లు అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ప్రధానంగా ఈ విస్తీర్ణం తగ్గడానికి ఉత్పత్తులకు తగిన గిట్టుబా టు ధర రాకపోవడమేనని తెలినప్పటికీ ప్రభుత్వం అందు కు తగిన చర్యలకు పూనుకోవడంలేదు. చక్కెర ధర పెరిగి న సందర్భాల్లో అదుపుకోసం తీసుకుంటున్న చర్యలు, విడుదలవుతున్న సబ్సిడీ నిధులు ఫ్యాక్టరీలకే లబ్ధి చేకూరుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో చెరకు సాగుకు అవసరమయ్యే పెట్టుబడులు రైతాంగానికి ముందుగానే సమకూరుస్తున్న ప్రైవేటు యాజమాన్యాలు కొనుగోలు సమయం లో ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నాయి. మార్కెట్లో చక్కెర ధర 22 రూపాయలున్న సమయంలో చెరకు మద్దతు ధర 1700 రూపాయలుండగా, ప్రస్తుతం చక్కెర ధర 36 రూపాయలకు చేరుకున్నా ధరమాత్రం వంద రూపాయలకు మించి పెరగలేదు. సహకార చక్కెర కర్మాగారాల పరిధిలో చెరకు రైతులు మరింతగా నిలువు దోపిడీకి గురవుతున్నారు. చక్కెర శాతం అధికంగా ఉన్న చెరకునుబట్టి ధరను చెల్లించాల్సివున్న సహకార కర్మాగారాలు మద్దతు ధర చెల్లింపులో చేతులెత్తేస్తున్నాయి. రాష్ట్రంలో క్రషింగ్ సీజన్ ప్రారంభమై దాదాపు నెలరోజులు గడిచినా ఇప్పటివరకు సహకార ఫ్యాక్టరీలు ప్రతిపాదిత ధరలను ప్రకటించలేదు. ఈ అంశంపై ఇటీవల జరిగిన శాసనసభలో ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. ఉమ్మడి రంగం, ప్రైవేటు రంగంలో కొనసాగుతున్న ఫ్యాక్టరీలు ఒకటి, రెండు మినహా ధరలను ప్రకటించాయి. కానీ సహకార రంగంలో ఉన్న 11 ఫ్యాక్టరీలు రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయి. చక్కెర ఉత్పత్తి శాతం 7 నుంచి 9.45 వరకు నమోదవుతున్నా చెరకు ధర రూ.1700 లకు మించడంలేదు. అనకాపల్లి, తాండవ, చిత్తూరు, కోవూరు సహకార కర్మాగారాల్లో టన్ను రూ.1700 మాత్రమే చెల్లించేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం నిర్దిష్టమైన ఆదేశాలిచ్చినా ఇప్పటివరకు ప్రతిపాదిత ధరలను ప్రకటించలేదు. తెనాలిలోని ఎన్‌విఆర్, నిజామాబాద్, కడప చక్కెర ఫ్యాక్టరీలలో క్రషింగ్ ప్రారంభించలేదు. చక్కెర ఉత్పత్తి 9.35 శాతంగా ఉన్న విజయనగరంలో జిల్లాలోని విజయరామ సహకార చక్కెర ఫ్యాక్టరీ టన్ను ఒక్కింటికి ధర కేవలం రూ.1800గా ప్రకటించింది.ఉమ్మడి రంగంలో కొనసాగుతున్న చక్కెర ఫ్యాక్టరీలు రికవరీ శాతం ఎంతున్నా మద్దతు ధర రూ.2200లుగా ప్రతిపాదించాయి. కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిలోని నిజాం డెక్కన్ షుగర్స్ లిమిటెడ్ చక్కెర రికవరీ 8.62 శాతం, నిజామాబాద్ జిల్లా షక్కర్‌నగర్‌లోని నిజాం డెక్కన్ షుగర్స్ లిమిటెడ్‌లో రికవరీ శాతం 10.20, మెదక్ జిల్లా మంబోజిపల్లిలోని నిజాం డెక్కన్ షుగర్స్ లిమిటెడ్‌లో రికవరీ శాతం 9.35 గా ఉన్నప్పటికీ ఈ మూడు కర్మాగారాలు రైతులకు ఒకే విధమైన ధరలను చెల్లించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి.
ప్రైవేటు చక్కెర ఫ్యాక్టరీలు ప్రాంతాల వారీగా ధరలను ప్రతిపాదించాయి. చిత్తూరు జిల్లా సాగర్ షుగర్స్, ప్రుడెన్షియల్ షుగర్స్ చెరకు ప్రతి టన్ను రూ. 1900, కృష్ణాజిల్లా డెల్టా షుగర్స్, కెసిపి షుగర్స్ రూ.1950, విజయనగరం జిల్లా ఎన్‌సిఎల్ షుగర్స్, శ్రీకాకుళం జిల్లా ప్యారీస్ షుగర్స్, కర్నూలు జిల్లా రాయలసీమ షుగర్స్, తూర్పు గోదావరి జిల్లా నవభారత్ షుగర్స్, సర్వరాయ షుగర్స్, పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రా షుగర్స్, జెపోర్ షుగర్స్, కృష్ణా జిల్లా ఉయ్యూరులోని కెసిపి షుగర్స్, మహబూబ్‌నగర్ జిల్లా ఎన్‌ఎస్‌ఎల్ కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీలు ప్రతి టన్నుకు రూ.2000 చొప్పున మద్దతు ధరలను చెల్లించనున్నట్లు ప్రకటించాయి. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి, నిజాంసాగర్‌లలోని గాయత్రి షుగర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లతోపాటు ఖమ్మం జిల్లా మధుకాన్ షుగర్స్, మెదక్ జిల్లా సంగారెడ్డిలోని గణపతి షుగర్స్ మద్దతు ధర రూ.2200, ఖమ్మం జిల్లా కాకతీయ షుగర్స్ రూ.2150, ట్రిడెంట్ షుగర్స్ రూ.2100 ధరలు చెల్లించనున్నట్లు ప్రతిపాదన పంపారు. కానీ చిత్తూరు జిల్లా కెబిడీ షుగర్స్, నెల్లూరు జిల్లా గాయత్రి షుగర్స్ ఫ్యాక్టరీలు ఇప్పటివరకు ఎలాంటి ధరలను ప్రతిపాదించలేదు.చెరకు సాగు వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే ప్రతి టన్ను చెరకు పండించడానికి రూ.2 వేలకు పైగానే పెట్టుబడి వ్యయం అవుతున్నట్లు వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. రైతు శ్రమ లెక్కగడితే మరో రూ.500 పెరిగే అవకాశముంది. కానీ ఫ్యాక్టరీలు చెల్లిస్తున్నది రూ.1800 నుంచి రూ.2200 లోపు మాత్రమే. పండించిన పంట గిట్టుబాటు కాక, శ్రమకు తగిన ఫలితంలేక రైతులు చెరకు సాగుపై ఆసక్తి చూపడంలేదు.