2011వ సంవత్సరాన్ని ఒక్కసారి గుర్తుచేసుకుంటే సంతోష, విషాదాల సమ్మేళనంతో ఈ ఏడాది ముగిసింది. సంతోషకరమైన సంఘటనలను మననం చేసుకుంటే...ఫిబ్రవరి 4న హీరోయిన్ నవనీత్‌కౌర్ పెళ్లి జరిగింది. శాసనసభ్యుడు రవిరాణాను ఆమె వివాహమాడారు. ఇక 58వ జాతీయ చలనచిత్ర అవార్డులలో తెలుగులో తీసిన ఉత్తమ విద్యావిషయక చిత్రంగా 'అద్వైతం' అవార్డు పొందింది. ఇదే ఏడాది తెలుగు, తమిళ, హిందీ భాషా చిత్రాల దర్శకుడైన కె.బాలచందర్‌కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం లభించింది. ఇక మార్చి 5న అల్లు అర్జున్, స్నేహారెడ్డిల వివాహం జరిగింది. మే 5న జూ.ఎన్.టి.ఆర్., లక్ష్మీప్రణతిల వివాహం జరిగింది. డిసెంబర్ 1న రామ్‌చరణ్, ఉపాసనల నిశ్చితార్ధం జరిగింది. ఇదేనెల 28న చిన్ననాటి స్నేహితుడు, బిజినెస్‌మేన్ ప్రజిత్‌తో మమతామోహన్‌దాస్ వివాహం జరిగింది.