1, జనవరి 2012, ఆదివారం

ఇదీ బొల్లారం రాష్ట్రపతి నిలయం...

హైదరాబాద్‌ మహానగరాన్ని పాలించిన నజాం నవాబుల కాలంలో
ఎన్నో భవంతులు, విశ్రాంతి మందిరాల నిర్మాణం జరగ్గా..
ప్రస్తుతం కాల గమనంలో అవి అనేక ప్రభుత్వ కార్యాలయాలుగా,
విశ్వ విద్యాలయాలుగా, వైద్యలయాలుగా ప్రజలకు సేవలందిస్తున్నాయి... బొల్లారంలో నిర్మించిన వసతి గృహం నేటికి చెక్కు చెదర కూడా ఏకంగా
దేశ ప్రధమ పౌరునికి ఆతిధ్యమిస్తూ... ఢిల్లీ రాజ్‌ భవన్‌ దర్పాన్ని చూపిస్తోంది.
ప్రపంచంలో ఏదేశానికి లేని సంస్కృతి సంప్రదాయాలు, మన భారతావని సొంతం. భిన్నత్వంలో ఏకత్వం ఉన్న ఈ దేశానికి ప్రధమ పౌరులు కావాలంటే... చిన్న మాటలు కాదు. సర్వోత్త మ పదవిలో ఉండే వారు కేవలం దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌ భవన్‌కి మాత్రమే పరిమితం కాకుండా తమ భద్రతని కూడా పక్కకు నెట్టి ప్రజలలో మమేకం అవుతున్న సందర్భాలు గత కొన్నేళ్ల్లుగా ఇపðడిపðడే చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే వివిధ సందర్భాలలో రాష్ట్రాలను పర్యటించేపðడు వారికి వసతి చూపేందుకు వసతి భవనాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
రాష్ట్రపతులకు ప్రత్యేక వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన రాగా... వాటిలో ఒకటి ఈశాన్య రాష్ట్రాలలోనూ.. మరొకటి దక్షిణాదిన ఉండాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఈశాన్య రాష్ట్రా లకు సంబంధించి సిమ్లాలో రాష్ట్రపతి విడిది నివాసం ఏర్పాటు కాగా... దక్షిణా దిన ఆ బాధ్యతని చేపట్టే అదృష్టాన్ని హైదరాబాద్‌ నగరం సొంతం చేసుకుంది. కేవలం పర్యటనలపðడే కాకుండా ఆయా కాలాలలో ఢిల్లీలోని వాతావరణం ఇబ్బందులు పెడుతున్నపðడు దేశా ్థ్యక్షులు ఈ విడిది నివాసాల లో కొలవుదీరేలా ఏర్పాట్లు చేసా రు. ఇక హైదరాబాద్‌ రాష్ట్రపతి నివాస్‌ ఏర్పాటుచేసిన భవనానికి పెద్ద చారిత్రిక నేపధ్యం ఉంది. బొలారంప్రాంతంలోఅత్యంత కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు నడుమ ఉండే ఈ భవనం దేశ రాజధాని లోని రాష్ట్రపతిభవన్‌ ముంగిట ఉన్న మొఘల్‌ గార్డెన్స్‌కి ధీటుగా

ఉద్యాన వనం నడుమ నిత్య పచ్చ దనంతోశోభాయమయంగా సందర్శ కుల్ని సైతం కట్టి పడేస్తుంది.
చరిత్రలో...
సికింద్రాబాద్‌ దగ్గర్లోని బొల్లారంలో అప్పటి నిజాం నవాబు 'నజీర్‌ ఉద్‌ ద్వోలా' 1860లో తన విశ్రాంతి మందిరంగా పెద్ద భవనాన్ని నిర్మిం చాడని చరిత్ర చెప్తారు. దాదాపు 93 ఎకరాల సువిశాల ప్రాంతంలో జరి గిన ఈ ప్యాలస్‌ చుట్టూ 50 అడుగు ల ఎత్తులో ఉండే గోడలు నిర్మించి, కనుచూపు మేరలో ఉండే శత్రువుని కనిపెట్టేందుకు వీలుగా కందకాల నిర్మాణం కూడా జరిపించారు. నిత్యం నిజాం సైనికుల కనుసన్నల్లో ఉం డేది. తదుపరి సర్‌ సాలార్జంగ్‌ పాలనలోకి ఈ ప్రాంతం వచ్చాక ప్రధాన సైనిక అధికారి కార్యాలయం గామారింది. ఇక్కడ ఉన్న సువిశాల

ప్రాంగణంలో సైనిక శిబిరాలను ఏర్పాటు చేసి తమ సైనికులకు అనేక యుద్ద విద్యల్లో శిక్షణ ఇవ్వ టంజరిగేది దీన్ని ఎప్పటికపðడు పర్యవేక్షిం చేందుకు ప్రధాన సైనికాధికారి కార్యాలయంగా మార్చినట్లు చెప్తారు. అయితే బ్రిటీష్‌ పాలకులతో కుదిరిన ఒప్పందాలలో భాగంగా సికింద్రా బాద్‌ ప్రాంతంలో బ్రిటిష్‌ సైన్యాని కి స్ధావరాలు ఏర్పాటు చేసుకునేం దుకు నిజాం అనుమతి ఇవ్వగా...
ఏర్పడిన సైనిక ప్రదేశానికి దగ్గర లో ఉన్న ఈ గృహం తమకు అనువు గా ఉంటుందని భావించిన బ్రిటిష్‌ సైనిక అధికారులు సైతం నిజాంని ఒప్పించి తమ నివాస గృహంగా మార్చేసుకున్నారు. అప్పట్లో దీనిని బ్రిటీష్‌ రెసిడెన్సీగా పిలిచేవారు.
1947 ఆగష్టు14 అర్ధరాత్రి భారతా వనికి పర దాస్యశృంఖలాల నుండి బంధ విముక్తి లభించాక దేశంలోని సంస్ధానాలు, చిన్న చిన్న రాజులు సైతం తమ రాజ్యాలను అఖంఢ భారత దేశం ఏర్పాటులో భాగంగా విలీనం చేసినా హైదరాబాద్‌ సంస్ధానం ప్రత్యేకంగా చూడాల్సిందేనని భీష్మించుకున్న నిజాం ప్రభువులు అందుకు తగ్గట్టు ప్రయత్నాలు చేసుకోవటం ప్రారంభించడం ప్రజలపై వేధింపులు పెరిగిపోవటంతో నిజాం పాలన తట్టుకోలేని ప్రజలు ఆంధ్ర మహాసభ సారధ్యంలో ఉద్యమబాట పట్టారు. ఈ ఉద్యమం చివరకి హింసా మార్గం పడుతుండటంతో భారత ప్రభుత్వం జోక్యం చేసుకుని పోలీసు చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. దీంతో 5 రోజుల పాటు నిజాం సైనికులతో పోరాడిన సైనికులు వారిని ఓడించి నిజాం సంస్దానాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవటంతో అంతవరకు భారతావనిలో విలీనానికి ససేమిరా అన్న నిజాం... తప్పని సరి పరిస్ధితిలో కొన్ని ఒప్పందాల మేరకు విలీనానికి సరేన ని అనాల్సి వచ్చింది.
అలా నిజాం సంస్ధానం భారతావనిలో కలిపేశాక హైదరాబాద్‌లో భారత సైనిక స్ధావరాలను కంటోన్మెంట్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసి అక్కడ ఉన్న ప్యాలస్‌ని మిలట్రీ తన ఆధీనంలోకి తీసుకుంది.ఆపై భారత రాష్ట్రపతి విడిది నివాసంగా దక్షణాదిన ప్రత్యేక భవన నిర్మాణ ప్రక్రి య ప్రారంభమైనపðడు...అన్నికాలాలలో ఆహ్లాద కొలిపే అద్భుత వాతావరణం ఉన్న హైదరాబాద్‌, బొల్లారంలో నాణ్యతా ప్రమాణాల నడుమ నిర్మించి న ఈ భవనంపై దృష్టిసారించి... కొత్త సొగసులద్ది దీనిని రాష్ట్రపతి నిలయం గా మార్చి వేసింది భారత ప్రభుత్వం. దాదాపు 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ భవనంలో 20 నివాస గదులు ఉన్నాయి. వీటన్నింటినీ మూడు విభాగా లుగా విభజించారు. ప్రసిడెంట్‌ వింగ్‌, ఫ్యామిలీ వింగ్‌, ఎడిసివింగ్‌లు గా పేర్కొనే ఈ రూంలకు ప్రత్యేకంగా పెద్ద డైనింగ్‌ హాల్‌, మార్నింగ్‌ రూం, ఎడిసి డైనింగ్‌ హాల్‌ ఉన్నాయి. ఈ డైనింగ్‌ హాళ్ల ప్రత్యేక వంటగదు లుండటమే కాకుండా ఒకదాని నుండి మరో దానిలోకి ఇట్టే వెళ్లేలా దీనిని రూపొందించారంటే నాటి నిజాం ప్రభువు అభిరుచి ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చంటారు ఇక్కడి ప్రజలు. ప్రస్తుతం ఈ వంట గదులు ఆత్యాధునిత పరికరాలతో రూపొందించారు.
ఈ భవన నిర్మాణం 20-25 అడుగుల ఎత్తులో ఉండటం అన్ని భవనాలనీ కలుపుతూ చుట్టూ విశాలమైప వరండా నిర్మాణం ఉండటం చూస్తే మద్రాస్‌ ఇంజనీరింగ్‌ తరహాలో దీనిని నిర్మించినట్లు కనిపిస్తుంది. దీనిని సందర్శించేందుకు నగరజీవులతో పాటు హైదరాబాద్‌ వచ్చిన వారు ఉవ్విళ్లూరుతుంటారనటంలో ఆశ్చర్యంలేదు.


శీతాకాల విడిదికి ప్రథమపోరులు
భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక మన దేశ ప్రథమపౌరులుగా ఉన్నవారికి దేశంలో మూడు చోట్ల విశ్రాంతి నిలయాలున్నాయి. వేసవి విడిది రాష్ట్రపతిహౌస్‌ సీవ్లూ. శీతాకాలం విడిది బొల్లారం (హైదరాబాద్‌). ఢిల్లిdలోని రాష్ట్రపతి భవన్‌లో నివాసం ఉంటారు. ఇంతకుముందు రాష్ట్రపతులుగా పనిచేసిన వారు ఇక్కడ విడిది కోసం వచ్చారు. 2000లో కెఆర్‌నారాయణన్‌ ఇక్కడికి విడిది కోసం వచ్చారు.. డాక్టర్‌ జ్ఞాని జైల్‌సింగ్‌ శీతాకాలం విడిది కోసం ఇక్కడికి వచ్చినప్పుడు కవి సమ్మేళనా లు, సాంస్కృతిక కార్య క్రమాలకు విపరీతంగా హాజరయ్యేవారు.
డాక్టర్‌ శంకర్‌దయాల్‌శర్మ హైదరాబాద్‌ వచ్చినప్పుడు ఇక్క డి ప్రజలు,ప్రాంతం చాలా బాగుందని కితాబిచ్చారు. డాక్టర్‌ అబ్దుల్‌ కలాం విడిది కోసం వచ్చినప్పు డు ఎక్కువగా శాస్త్రవేత్తలతో మీటింగ్స్‌ నిర్వహించడం, విద్యార్థులను కలుసుకోవడంతోపాటు అప్పు డప్పుడు ఇతర మీటింగ్‌లకు హాజరయ్యేవారు. డాక్టర్‌ ప్రతిభా పాటిల్‌ ప్రతి పర్యటన లోనూ ప్రకృతిని కాపాడటం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కృషిచేయాలని విజ్ఞప్తి చేస్తూ... ఈ ప్రాంతంలో హెర్బల్‌ గార్డెన్‌ని పెంచడమే కాకుండా ప్రజల సందర్శనార్ధం కూడా ఉంచుతున్నారు. దేశ ప్రథమ పౌరురాలిగా ప్రమాణం చేసాక ప్రతిభాదేవిసింగ్‌ పాటిల్‌ ఇప్పటికి నాలుగుసార్లు వచ్చారు.



మొఘల్‌కి ధీటుగా హెర్బల్‌ గార్డెన్‌
ప్రకృతి ప్రేమికుల ఆనందం కోసం రాష్ట్రపతి ప్రతిభాదేవిసింగ్‌ పాటిల్‌ 2010 జనవరి 10న హెర్బల్‌ గార్డెన్‌ను ప్రారంభించారు. ఈ గార్డెన్‌ కోసం 35 ఎకరాలు కేటా యించి వనమూలికలకు సంబంధించిన చెట్లు, వివిధ ప్రదేశాల నుంచి సేకరించిన మొక్కలను మానవునికి నిత్య జీవితంలో ఉపయోగపడేలా తీర్చి దిద్దారు. 116 రకాల పూల మొక్కలని, మామిడి, జావా,ఆవ్లూ, కొబ్బరి 4,500 రకాల పండ్ల మొక్కలు పెంచుతునే... వివిధ రకాల రోగాలను నయం చేసే హెర్బల్‌ మొక్కల పెంపకా నికి 7000 మీటర్ల స్థలాన్ని కేటాయించి, సర్పగంద, కలబంధ, సిట్రునిల్లా, లెమన్‌గ్రాస్‌, కొరియాండర్‌, శాండిల్‌ఉడ్‌, ట్యూబర్‌ రోస్‌, జాస్మిన్‌, తులసీ లాంటి మొక్కలు సిపిడబ్ల్యూ డి, ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ మెడిషినల్‌ ప్లాంటేషన్‌ బోర్డు కృషితో విస్తరించారు. రాష్ట్రపతి నిలయం, నేషనల్‌ మెడిష నల్‌ ప్లాంటేషన్‌ బోర్డులు నిధులు సమకూర్చడంతో ఈ గార్డెన్‌ని ఢిల్లీలోని మెఘల్‌ గార్డెన్‌కి ధీటుగా తీర్చిదిద్దాలనిర్ణయించి డ్రిప్‌ ఇరిగేషన్‌ పద్ధతిలో సాగుచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతిభాదేవిసింగ్‌ పాటిల్‌ కోరిక మేరకు ఈ ప్రకృతి అందాలను వీక్షించేందుకు వీలుగా ప్రజల సందర్శనార్ధం జనవరి నెలలో ప్రత్యేక రోజుల్ని నిర్ణయించారు.