రీస్తు కొలువైన ఎన్నో ప్రార్ధనాలయాలు చరిత్రకి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తూ... వందల ఏళ్ల నుండి బైబిల్ సూక్తులను మానవాళికి అందిస్తూ... ఎందరికో జ్ఞానోపదేశాలుతో ... సక్రమ మార్గాలు పట్టిస్తూ....చారిత్రిక అధ్యాయంలో తమ వంతు బాధ్యతల్ని నెరవేరుస్తున్నాయి.
వందల ఏళ్లయినా చెక్కు చెదరకుండా జంటనగరాలకు తలమానికంగా నిలుస్తున్న చర్చిలలో ముఖ్య మైనవి చాలానే ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా చెపðకోదగ్గవి ఈస్టు మారేడు పల్లి సెయింట్ జాన్ చర్చి, సికింద్రాబాద్ సరోజినీదేవి రోడ్ లోని సెయింట్ మేరీ చర్చి, బొలారం హౌలీ ట్రినీటి చర్చి, అబిడ్స్ సెయింట్ జార్జి చర్చి, గన్‌ఫౌండ్రీ సెయింట్ జోసఫ్ కాధరల్ చర్చి, తిరుమలగిరి ఆల్ సెయింట్ చర్చి, చింతల బస్తీ విజయమేరీ చర్చి ఇలా నిజాం సంస్ధానంలో పరమత సహనానికి ప్రతీకలుగా నిలచిన చర్చిలు చాలానే ఉన్నాయి. ఈ చర్చిలన్నీ తమ గంటల నాదాలతో సమయ పాలన లేకుండా అపసవ్యమైపోతున్న జంటనగరాల జన జీవన స్రవంతిలో మార్పులు తెచ్చి, క్రమపద్దతిలో మలచేం దుకు ప్రయత్నిస్తూనే ఉన్నాయి.
నిజాంలో.. క్రైస్తవం...
నిజాంపాలన కొనసాగినపðడు కేవలం ముస్లింలకే కాకుం డా దాదాపు అన్ని మతాలు అన్యోన్యతకు హైదరాబాద్ సం స్ధానం పరిధిలో వెలసిన అనేక దేవాలయాలు, చర్చిలు తార్కాణంగా పేర్కొనవచ్చు. తెలుగు సంస్కృతీ సంప్రదాయా లతో వెల్లి విరుస్తున్న నిజాం సంస్ధానంలోకి తొలిసారిగా 16వ శతాబ్ధంలో వ్యాపార నిమిత్తం వచ్చిన డచ్ పాలకులు వ్యాపారంతో పాటు క్రైస్తవ మత ప్రచారం కూడా చేసే వారు. ప్రముఖ మతబోధకుడు వికార్ అపోస్ల్టిక రాసిన నివే దికల ప్రకారం..ఫ్రెంచ్ మిషనరీలు1735 నాటికి ఈ ప్రాం తంలో విస్తరించి క్రైస్తవాన్ని వ్యాప్తి చేయటంలో కీలక భూమిక పోషించాయని.. చెప్తారు.
కేవలం హైదరాబాద్ వరకు మాత్రమే పరిమితమై ఉండే క్రైస్తవం 18వ శతాబ్ధం నాటికి పరిపాలనా అవసరాల దృష్ట్యా పాలకులు కూడా వివిధ చర్చిల నిర్మాణంలో తమ వంతు సహాయసహకారాలు అందించడంతో అనేక చర్చిలు నిజాం సంస్ధానంలో వెలసిందని. ఆ క్రమంలో కోటి, ఛాద ర్ ఘాట్‌ల వద్ద బ్రిటీష్ పాలకులకు చెందిన అనేక క్రైస్తవ కుటుంబాలు నివాసం ఉండటం వారికి అందుబాటులో ఉండేందుకు అబిడ్స్‌లో సెయింట్ జార్జి చర్చి వెలసింద ని.. అలాగే నిజాం ఒప్పందంలో భాగంగా ఇక్కడికి వచ్చేసిన బ్రిటీష్ సైన్యాలు ఎక్కువగా ఉండే మారెడుపల్లి, బోయన్ పల్లి, తిరుమల గిరిలలో కూడా వారి ప్రార్ధనా సౌకర్యాల కోసం
చర్చిల నిర్మాణం జరిగింది. వీటికి ఇంజనీరింగ్ తదితర అంశాలతో పాటు కట్టడాలనిర్మాణ పర్యవేక్షణలోనూ బ్రిటిష్ సైనికులే పాల్గొనేవారు. వారికి సహాయకులిగా ఉండే కూలీ లను, నిర్మాణంలో ఉపకరించే. కలప, తలుపులు, ఫర్నీచర్ లకు టేకు కలపను, నిజాం పాలకులే సమకూర్చారు. ఇలా నిర్మితమైన చర్చిలలో శతవార్షికాలు పైబడ్డా ఏమాత్రం ఒరిగిపోక నాటి అద్భుత ఇంజనీరింగ్ వ్యవస్ధకు ప్రతీకలు గా.. వారు పాటించిన ఉన్నత ప్రమాణాలకు ధీటైన జవాబు గా నగరంలో ఈ అద్భుతకట్టడాలుగా నిలుస్తు వారసత్వ సంపదగా పేరు తెచ్చుకున్నాయి.
సెయింట్ జాన్ చర్చి...
బ్రిటీష్ సైనికులు నిజాం సంస్ధానరక్షణ కోసం వచ్చిన తొలి నాళ్లలో ఏర్పాటైన చర్చిగా చెప్తారు. ప్రస్తుతం ఇస్కాన్ ఎదురుగా... సరోజినీ దేవి బొమ్మ దగ్గర కనిపించే ఈ చర్చి నిర్మాణం 1843లో జరి గింది. ఈ చర్చి నిజాం సంస్ధానంలో క్రైస్తవానికి పునా దులు వేసిందని...చెప్తారు. శిలువ ఆకారంలో నిర్మా ణమైన ఈ చర్చిలో పూజాదికాలు నిర్వహించేందుకు బ్రిటన్ నుండి ఫాదర్స్‌ని రప్పించారని గత ఆరు దశా బ్ధాలుగా ఈ చర్చితో అనుబంధం ఉన్న ధియోడార్ కంఫర్ట్ చెప్పారు. దివాన్ బహదూర్ సేధ్ రామ్ గోపాల్ ఆర్ధిక సహాయంతో దాదాపు 158 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ చర్చిని ఆయన నిత్యం సంద ర్శించేవాడని... ఆ పై బ్రిటన్ సేనలు కంటోన్మెట్ ప్రాంతం నుండి చర్చి వరకు బ్యాండ్‌తో కవాతు చేసుకుంటూ వచ్చే వారు తమ ఆయుధాలు ఇక్కడ ఉంచేందుకు సురక్షిత ఏర్పాట్లు ఇక్కడ ఉండేవి. ఈ ప్రాంతాన్ని ఇప్పటికీ చర్చి వద్ద చూడవచ్చు.. అలాగే నిజాం రైల్వే అధికారులు, సైని కులు ఈ చర్చిని సందర్శించి ఎంతో విలువైన టేకు కలపతో కూడిన ఫర్నీచర్ బహుమతులుగా అందచేయగా 1918 లో తొలిసారిగా దీనిని విద్యుదీకరణ చేసారు. 1998-99 ఏడాది హుడా- ఇన్టాకలుే సంయుక్తంగా ఈ చర్చికి హెరిటేజ్ అవార్డుని అందించాయి.
సెయింట్ మేరీ చర్చి
సికింద్రాబాద్ సరోజినీ దేవి రోడ్‌లో ఈ చర్చి ఉంది. 1839లో హైదరా బాద్ మిషనరీ పోస్ట్ సారధ్యంలో ఓ చర్చి నిర్మాణానికి ఫాదర్ డానియల్ మర్ఫీ ప్రయత్నాలు ప్రారంభించా రు. హైదరాబాద్ మహా నగర ప్రాంతాలెన్నింటినో చూసిన ఆయ న అందరికీ అనుకూలంగా ఉండేలా సికింద్రాబాద్ ప్రాంతం లోనే సువిశాల ప్రాంగణంలో ఈ చర్చి నిర్మాణం బాగుం టుందని భావించి ఎంపిక చేసిన స్ధలంలో 1940లో ప్రారంభించడం జరిగింది. ఈ క్రమం లోనే ఆయన 1842లో బొల్లారంలో సెయింట్ ఫ్రాన్సిస్ జెవియర్ చర్చి నిర్మాణాని కి సన్నాహాలు చేస్తునే ఈ చర్చిని 500 మంది ఒకేసారి ప్రార్ధనలు నిర్వహించుకునేందుకు వీ లుగా 1850లో పూర్తి చేసారు. దీనికి తోడుగా సువిశాల మైన మైదానంఉండటంతో దశదిశలా ఇక్కడ ఏర్పాట్లు చేయటంతో అనేక మంది ఈ చర్చిలో ప్రార్ధనలకి ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే ఈ చర్చి ఆధ్వర్యంలో వివిధ పాఠశా లలు, కళాశాలలు నిర్వహిస్తు.. ఉన్నతస్ధాయిలో బోధనలు జరుగుతుండటంతో నిత్యం విద్యార్ధులతో చర్చి ప్రాంగణ మంతా కళకళ లాడుతూ ఉంటుంది.
హూలీ ట్రినీటీ చర్చి...
బొలారం ప్రాంతంలో 1847లో హైదరాబాద్ సంస్ధానాధిపతి నిజాం భూమిని విరాళంగా ఇవ్వగా క్వీన్ విక్టోరియా అందించిన నిధుల తో దీనిని నిర్మించారు. తొలి నాళ్లలో బ్రిటిష్ పాలకులకు మాత్రమే ప్రవేశం ఉండే ఈ చర్చిలో కాల క్రమేణా ఈ ప్రాంతంలో క్రైస్తవం బాగా పెరగటం ప్రారంభించడంతో భారతీయ క్రైస్తవ కుటుంబాల ను అనుమతించడం ప్రారంభించారు. ఇంగ్లాండ్ చర్చిలను పోలిఉండే ఈ చర్చిలో కూడా గాజు తో చేసిన కిటికీ లు సందర్శకుని కట్టిపడేసేలా ఉన్నాయి. 1983లో ఈ చర్చి కొచ్చిన క్వీన్ ఎలిజిబెత్ తన36వ వివాహవేడుకలను ఇక్కడే జరుపుకోవటం విశేషం.
సెయింట్ జార్జి చర్చి
అబిడ్స్‌లో ఉన్న గ్రామర్ స్కూల్ ప్రాంగణంలో ఈచర్చి నిర్మా ణం 1865లో ప్రారంభమై... అందమైన కళారూపంగా 1867 నాటికి పూర్తి చేసుకుని వాడుకలోకి వచ్చింది. అబి డ్స్, ఛాదర్‌ఘాట్, కోటీలలో ఉండే బ్రిటీష్ కైస్తవ కుటుంబా లు తమ ప్రార్ధనలకు నగరంలో ఉన్న చర్చిలు దూరంగా ఉండటంతో వల్ల తమకు దగ్గరలో ఓచర్చి నిర్మాణం కోసం నాటి నిజాంని కల్సి విన్నవించుకున్నారు.ఆతని సూచించిన మేరకు అబిడ్స్ ప్రాంతంలో సుమారు 11 ఎకరాల స్ధలంలో 1865లో బ్రిటన్ వాసి అయిన సర్ జార్డ్ యూల్ చేతుల మీదుగా పునాది రాయి వేసారు. 1867లో పూర్తయిన ఈ చర్చి చుట్టూ పెద్దఎత్తులన మొక్కల్ని పెంచి ప్రకృతి అందాల నడుమ దానిని ఉండేలా చూస్తునే... క్రీస్తు జీవితచరిత్రకు సంబంధించిన ఘటన ల్ని, బైబుల్ సూక్తులు కనుల పండుగ చేసేలా రూపొందించిన గాజు ఫలకాలు నేటికీ ఆకర్షించేలా ఉన్నాయి. ఈ చర్చిని సందర్శించిన ఆరవ నిజాం ప్రత్యేకంగా ఓ భారీ గడియారాన్ని, గంటలని తయారు చేయించి కానుకగా సమర్పించారు. అలాగే బ్రిటన్‌కి చెందిన పలు క్రైస్తవ కుటుంబాలు అందించిన విరాళాలతో ఇక్కడ 70 అడుగుల శిలువ రూపం చర్చి గంభీరతను చాటి చెప్పేలా కనిపిస్తుంది.
సెయింట్ జోసఫ్ కేథరల్ చర్చి
గన్‌ఫౌండ్రీలో నవాబ్ అస్మన్ ఝూ ఆర్ధిక సహాయంతో దీనిని నిర్మించారు. అప్పట్లో కొత్తబస్తీగా పిలవబడే ఈ ప్రాం తంలో ఓ పాఠశాలతో పాటు చర్చి నిర్మాణం చేయాలని రెవ్‌డొమిని క బాబ్రే చేసిన ప్రతిపాదనలకు 1869 డిశంబర్ 16న నిధుల మంజూరు కాగా...రెవరెండ్ పీటర్ కప్రోతి 1870 మార్చి 30న శంఖు స్ధాపన చేయగా... స్ధానిక క్రైస్థవుల సహకా రంలో ఫాదర్ ఎల్ మల్బెత్రీ 1872 నాటికి ప్రధాన భవనాలని పూర్తి చేసినా మిగిలిన వాటి నిర్మాణం పూర్తిగా జరగక ముందే 1875లో క్రిస్మస్ నాడు దీనిని ప్రారంభించారు. ఆపై నిధుల ఆలస్యం జరిగింది. 1886లో రెవరెంట్ కప్రో తి తొలి బిషప్‌గా బాధ్యతలు స్వీకరించాక ట్విన్ టవర్స్ నిర్మాణం కూడా చేయా లని ప్రతి పాదించి ఒక్కొక్కటి గా పలు దఫాలుగానిర్మాణాన్ని పూర్తిచేసారు. ఇందుకు 16 ఏళ్ల సమయం పట్టినా... అద్భు త కట్టడంగా తమ మదిలో నిలచేలా వారు తమకు అందిం చారని ఈ ప్రాంత క్రైస్తవ సోదరులు చెప్తారు. 1892లో ఈ చర్చిలో ఏర్పాటు చేసిన గంటలు సమయానుకూలంగా వ్రెూగిస్తే.. వినులవిందుగా కంటోన్మెంట్ ప్రాంతం వరకు వినిపించేదని తమ పూర్వీకులు చెప్పేవారని విజరుకుమార్ అనే సోదరుడు చెప్పారు. అలాగే ఈ చర్చిలో అలంక రించిన అనేక పెయింటింగ్‌లు ఇటలీ నుండి వచ్చినవే నని ఏళ్లు గడుస్తున్నా... వాటి నాణ్యత ఏమాత్రం చెక్కు చెదరక పోవటం విశేషంగా చెప్పాడాయన.
ఈ చర్చిని ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ సంద ర్శించి పెద్ద గడియా రాన్ని విరాళంగా ఇవ్వటమే కాకుండా టవర్ నిర్మాణానికి ఆర్ధిక సాయం అందించాడని... అలాగే అనేక పెయింటింగ్‌లని ఈచర్చికి వివిధ సందర్భాలలో కానుకలుగా సమర్పిం చాడని ఇక్కడి సోదరులు చెప్పారు. దాదాపు 132 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ చర్చివద్ద ప్రతి ఆది వారం పండగ వాతావరణం నెలకొంటుంది.
ఆల్ సెయింట్ చర్చి..
నాటి సైనిక క్రైస్ధవ కుటుంబాల ప్రార్ధనలకు అనుకూలంగా ఉండేందుకు ఈ చర్చిని తిరుమల గిరిలో నిర్మించారు. 186లో జరిగిన ఈ చర్చి సైతం బ్రిటన్‌లోని చర్చిల నిర్మా ణాలను పోలి ఉంటుంది. ఇందులో ఆవిష్కరించిన క్రీస్తు గాజు చిత్రంతో పాటు అనేక కళా రూపాలు విశేషంగా ఆకర్షిస్తాయి.
విజరు మేరీ చర్చి
చింతల బస్తీలో నిర్మించారు దీన్ని... ఆరోగ్య దేవత చర్చిగా అంతా పిలుచుకునే ఈ చర్చి నిర్మాణం 1905లో జరిగిం ది. మహవీర్ హాస్పటల్ దగ్గర్లో జరిగిన ఈ చర్చిలో ప్రార్ధ నలు చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుందని నగర క్రైస్తవ సోదరులకు అపారమైన నమ్మకం. అందుకు తగ్గట్లే నేటికీ వేలాదిగా ఇక్కడకి తరలి వచ్చి ప్రార్ధనలు చేస్తుండటం గమనార్హం.
అప్పట్లో వేలాదిగా తరలి వస్తూ.. వసతి సౌకర్యం లేమితో యాత్రీకులు పడుతున్న ఇబ్బందులు గమనించిన ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ ప్రార్ధనాలయ నూతన భవ నాలకు శంఖుస్ధాపన చేయగా 1959 నాటికి అవి పూర్త య్యాయి. నగరానికి వచ్చే ప్రతి క్రైస్తవ సోదరీ సోదరీ మణులు ఒక్కసారైనా ఈ చర్చిలో ప్రార్ధనలు చేయాలని ఉవ్విళ్లూ రుతారని ఇక్కడి కొచ్చిన కడప వాసి డేవిడ్ జాన్ చెప్పారు.