అసదొద్దీన్ ఓవైసీని విమర్శిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఎంఐఎం టీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావును హెచ్చరించింది. తమ పార్టీ తెలంగాణకు వ్యతిరేకమని కేవలం టీఆర్‌ఎస్ వారే దుష్ర్పచారం చేస్తున్నారు తప్ప ఓవైసీ ఎప్పుడు అలా అనలేదని ఎంఐఎం నాయకులు సిరాజ్‌ఖాద్రి పేర్కొన్నారు.
ముస్లింల పేర దోపిడికి పాల్పడుతున్నారన్న ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు. హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సిరాజ్‌ఖాద్రి హెచ్చరించారు