30, జనవరి 2011, ఆదివారం

మరో 'శివ' తీస్తాడట

నాగార్జునకు 'శివ'తో ప్రాణం పోసానన్న రేర్ క్రెడిట్ తనకే దక్కిందని రామ్ గోపాల్ వర్మ పలుమార్లు చెప్పుకుంటూనే ఉంటాడు. అలాగని 'అంతం' గురించి ఎప్పుడూ మాట్లాడడు బట్ ఈసారి నాగచైతన్యకు కూడా అదే రకమైన సినిమాను అందించబోతున్నాడు వర్మ.

బెజవాడతో రామూకున్న అనుబంధంతో 'శివ'ను తన కాలేజీ కథతోనే తీసాడు ఇక ఇప్పుడు అదే రకమైన 'బెజవాడ రౌడీలు'తో నాగచైతన్యకు కొత్త లైఫ్ ఇచ్చేందుకు రెడీ అయిపోయాడు. విజయవాడ రౌడీ రాజకీయాల నేపద్యంలో రూపొందే ఈ చిత్రంలో తన టెక్నికల్ టీంను అనౌన్స్ చేయకపోయినా నాగచైతన్య మాత్రం నా హీరో అనేలా ఓ మెసేజ్ వదిలేసాడు. కెరీర్ మొదటి రోజులతో పోల్చుకుంటే నాగార్జున కన్నా నాగచైతన్యలో ఓ వంద రెట్లు మంచి నటుడు ఉన్నాడన్న భరోసా అయితే ప్రేక్షకులకు కలిగించాడు కనక చైతన్య తన తదుపరి సినిమాలను ఇంకొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మంచిది.

తుపాకి నుంచి సేకరణ