రియాలిటీ సినిమాల పేరిట రెచ్చిపోతున్న బాలివుడ్ దర్శకుల క్రియేటివిటీకి హద్దే లేకుండా పోతుంది. అందుకు ఇది ఓ ఉదాహరణ. ర్యాగింగ్ ఆధారంగా రూపొందింది 'హాస్టల్' అనే హిందీ చిత్రం. కాలేజిలో అడుగుపెట్టిన కొత్త స్టుడెంటును సీనియర్లు గ్యాంగ్ రేప్ చేయడమనే పరమ చెత్త పాయింటుతో దర్శకుడు దీన్ని తెరకెక్కించాడు.
సినిమాలో నటించడం కాదు పాత్రలో జీవించాలి అని చెప్పే దర్శకుడి వద్ద మన్నలేక కొందరు ఆర్టిస్టులు అప్పటికే పారిపోయారు. చివరగా ఆ గ్యాంగ్ రేప్ దృశ్యం తీయాల్సిన సమయానికి పాత్రధారులని ప్యాంటు జిప్పులు తెరిచిపెట్టి కెమెరా ముందు చండాలమైన పోజుల్లో నిలబడమనేసరికి వణుకుపుట్టి, 'మనం తీసేది హిందీ సినిమానా లేక ఇంగ్లీష్ బూతు సినిమానా' అంటూ నోటికొచ్చిన బూతులు తిట్టి సదరు ఆర్టిస్టులు వెళ్ళిపోయారు.
మిగిలిన వాళ్ళతో బాడీ డబల్ ఉపయోగించి సినిమాను కంప్లీట్ చేసే మొన్నే జనాల మీదకి ఈ 'హాస్టల్'ను వదిలారు.
తుపాకి నుంచి సేకరణ