జిమ్మిక్కులు మాని జ గన్‌కు జైకొట్టాలంటూ రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి రఘువీరారెడ్డి పై దాడి చేనంత పని చేసారు జగన్ అభిమానులు. ఆలస్యంగా వెలుగు చుసిన ఈ ఘటన రఘువీర సొంత నియోజకవర్గం లో జరిగిన రచ్చబండలో ఎదురైంది. వేదిక వద్ద భారీ సంఖ్యలో పోలీసులని మొహరించినా జగన్ అభిమానులు ముకుమ్మడిగా లేచి మంత్రి ప్రసంగా న్ని అడ్డుకున్నారు. 'మీ జిమ్మిక్కులు వద్దు... జగన్‌కు జై కొట్టాల్సిందే... జగన్ జిందాబాద్, వైఎస్ఆర్ జిందాబాద్' అంటూ పెద్దఎత్తున నినాదాలు చే స్తూ చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. జగన్‌కు జై కొట్టకపోతే గ్రామాలలోకి రానివ్వమంటూ తేల్చి చెబుతూ మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.