వైద్య, ఆరోగ్య శాఖను నిధుల కొరత పట్టిపీడిస్తోంది. ఇప్పటికే పీహెచ్‌సీలకు మందుల కోసం కేటాయించిన నిధులు నిండుకున్నాయి. ఆర్థిక సంవత్సరం మార్చితో ముగుస్తుండగా, మందుల పైసలు అడుగంటాయి. ఇదిలా ఉండగా, గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు, ఆరోగ్య సేవలకు, ఆరోగ్య ఉప కేంద్రాలకు కేటాయించే అన్‌టైడ్ ఫండ్‌కు ఈ ఏడాది గండిపడింది.
మంజూరైన నిధులను ఖర్చు చేయకుండానే ప్రజాప్రతినిధులు, అధికారులు అందినంత దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని మండలాల్లో పీహెచ్‌సీల అభివృద్ధి నిధులను ప్రజాప్రతినిధులు సొంతానికి వాడుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల రాజకీయ జోక్యం, అధికారుల ఒత్తిళ్ల కారణంగా నిధులు ఖర్చు కాకుండా అలాగే ఉన్నట్లు తెలుస్తోంది.
ఆరోగ్య, శానిటేషన్ పనుల కోసం ప్రతి సంవత్సరం ఆరోగ్య ఉప కేంద్రాలకు ప్రతి ఏడాది అన్‌టైడ్ నిధుల కింద రూ.10 వేలు ఇస్తున్నారు. అయితే, చల్ల వాటికి ఈ ఏడాది ఇంకా ఒక్క పైసా మంజూరు కాలేదు. కానీ విచిత్రంగా పీహెచ్‌సీలకు మంజూరవుతున్న నిధులు దుర్వినియోగమవుతున్నాయనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో నిధుల బాధ్యతను ఎంపీడీఓలకు అప్పగిస్తూ ఇటీవల జీఓను జారీ చే సి ప్రభుత్వం చేతులు దులుపు కావటంతో నిధులు లేకుండా బాధ్యతలు అప్పగించడం ఏమిటని ఇటు వైద్యులు, అటు ఎంపీడీఓలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.