మహేష్ బాబు అయిదు, పవన్ కళ్యాణ్ నాలుగు , జూనియర్ ఎన్టీయార్ మూడు, ప్రభాస్ రెండు సినిమాలు ఒప్పేసుకున్నారు అంటూ మీడియాలో ఊకదంపుడు బాగానే వేస్తున్నా సైలెంటుగా చాప కింద నీరులాగా చేరిపోతున్నాడు నాగ చైతన్య. చాక్లెట్ బాయ్ క్యారక్టర్స్ మాత్రమె కాకుండా యాక్షన్, పర్ఫార్మెన్స్ పరమైన పాత్రలను ఎన్నుకుంటూ చైతు తండ్రిలాగా విశిష్టతను చూపించ బోతున్నాడు.
సుకుమార్ 'ఐ లవ్ యు'లో లవర్ బాయ్ గా, వెంటనే అజయ్ భూయాన్ దర్శకత్వంలో యాక్షన్ హీరోగా మరో పక్క వర్మ 'బెజవాడ రౌడీలు'లో పూర్తి రగ్గుడ్ క్యారక్టర్ అటు తర్వాత తాత రామానాయుడు చిత్రంలో ఫ్యామిలీ హీరోగానే కాక 'డాన్ శీను' దర్శకుడు మలినేని గోపీచంద్ చేతుల మీదుగా ఇంకో మాస్ మసాలా చిత్రానికి కూడా చైతు ఓకే చెప్పేశాడట. సినిమా సినిమాకీ చైతు వేరియేషన్ చూస్తుంటే నాగార్జున తన కొడుకు కోసం పక్కా ప్లాన్ రెడీ చేసినట్టే ఉంది. బెస్ట్ ఆఫ్ లక్ చైతు.
తుపాకి నుంచి సేకరణ