బొమ్మరిల్లు'లాంటి సినిమా మాకు ఒక్కటి కూడా తగల్లేదేమిటని పెద్ద హీరోలు ఫీల్ అవుతుంటే, దిల్ రాజు పుణ్యమాని తెలుగులో అదే బొమ్మరిల్లుతో పాగా వేసేసిన సిద్ధార్థ్ మాత్రం వరస ఫ్లాపులతో ఉనికినే ప్రశ్నార్థకం చేసుకుంటున్నాడు. గుర్రం చేసేది గాడిద చేసినా, గాడిద చేసేది గుర్రం చేసినా ఇలాగే ఉంటుంది.
మాస్ హీరో అవ్వాలి అన్న కల హీరోలందరికీ ఉన్నా ఎవరికి ఏం చేతనవుతుందో అది చేసుకొని ఉన్నంతలోనే తృప్తి పడుతుంటే ఏటికి ఎదురీదినట్టు సిద్ధార్థ్ ధీరుడిలా ఫీలై ఆటాడేసుకోవాలి అనుకున్న ప్రతిసారి ప్రేక్షకులు తగిన శాస్తి చేసి పంపారు. రోజులు దగ్గర పడ్డాయి అనుకున్న తరుణంలో మళ్ళీ దిల్ రాజు నుండి ఫోన్ రావడంతో 'ఓ మై ఫ్రెండ్' అంటూ ప్రేమ కురిపించేసాడు. ఫిబ్రవరిలో మరో 'బొమ్మరిల్లు'ను మొదలెడదాం అని చెప్పేసరికి సిద్ధార్థ్ ఆనందం తట్టుకోలేకపోతున్నాడు. వేణు శ్రీరాం అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్న 'ఓ మై ఫ్రెండ్'కు 'ఓ మై డార్లింగ్' అమృతా రావుగా ఫైనల్ అయిపొయింది.
తుపాకి నుంచి సేకరణ