పవన్ కళ్యాణ్ సినిమా ఆరంభం అంటేనే అభిమానులకు అదిరిపోతుంది. అలాంటిది హిందీలో హిట్టు కొట్టిన 'దబాంగ్' సినిమాను తెలుగులోకి పవనే రీమేక్ చేస్తుంటే హడావిడి మామూలుగా ఉంటుందా? అందుకే 'గబ్బర్ సింగ్' సినిమా ప్రకటన విడుదలైన పన్నెండు గంటల్లోపే పవన్ కళ్యాణ్ కొత్త పోలీస్ డ్రెస్సు కుట్టించుకోని మరీ సినిమా ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసిపారేసాడు. హిందీ మాతృకలో సల్మాన్ ఖాన్ ధరించిన ఆహార్యాన్నే మక్కీకి మక్కీ దింపేసాడు గానీ పవన్ కళ్యాణ్ అన్న పేరు రెండు సార్లు కాకుండా పోస్టర్ మీద పవన్ కళ్యాణ్ ఒక్కసారైనా మొహం చూపిస్తే ఇంకా బాగుండేది అంటున్నారు అభిమానులు. ఇదేనయ్యా కొత్త రకమైన పబ్లిసిటీ అంటే చేసేదేమీ లేదు గానీ మరీ రీమేక్ కథలకు ఘోరంగా అలవాటు పడ్డానని బాధతో సిగ్గుపడిపోయి మొహం దాచుకోలేదు గదా సుమీ?
తుపాకి నుంచి సేకరణ
తుపాకి నుంచి సేకరణ