30, జనవరి 2011, ఆదివారం

రామ్ చరణ్ కిం కర్తవ్యం?

మొన్నేమో 'ఆరెంజ్' జ్యూస్ ఇచ్చి బొమ్మరిల్లు భాస్కర్ ను హడలెత్తించారు, నిన్నేమో 'మెరుపు' స్క్రిప్టు పేరుతో ధరణిని తరిమేశారు...మరిప్పుడు రామ్ చరణ్ ఏం చేస్తున్నట్టు? అసలు మగధీరుడి కిం కర్తవ్యం ఏమిటీ? ఈ ప్రశ్నల మీదే ఇప్పుడు సిని సర్కిల్స్ లో లోతైన డిస్కషన్స్ నడుస్తున్నాయి.

'మగధీర' అంతోటి సినిమా కాకపోయినా ఓ మోస్తారు హిట్టిచ్చే దర్శకుడు కంటికి కనపడితే వెంటనే మెగా కాంపౌండ్ వద్దకు తరలిస్తే మీకు తగిన పారితోషికాలు ఇవ్వబడతాయి అన్నరేంజులో కథల కోసం, దర్శకుల కోసం రామ్ చరణ్ వేట సాగుతోందట. సమయానికి ఒక్క బోయపాటి, పైడిపల్లి వంశీ తప్ప పెద్ద దర్శకులెవరు ఖాళీగా లేకపోవడంతో అరవం దర్శకుల మీదా ఓ కన్నేశారు. అయినా ఫలితం లేదు. వయసుకు మించిన అంచనాలతో అభిమానుల నుండి వత్తిడి, ఇమేజి చట్రంలో ఇరుక్కోకుండా ఉండేందుకు ప్రయత్నాలు, ఎటువంటి కథతో ముందుకు వెళ్ళాలో తెలియని అయోమయం...అన్నీ వెరసి రామ్ చరణ్ పైన విపరీతమైన ప్రెజర్. ఇక ఇన్ని జయించి కొత్త కథ దొరికేదేప్పుడో, కొత్త సినిమా స్టార్ట్ అయ్యేదేప్పుడో, మళ్ళీ రామ్ చరణ్ బిజీ అయ్యేదేప్పుడో?

తుపాకి నుంచి సేకరణ